విధాత: క్రికెట్ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ ఓ మహిళకు సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నవీనపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రశంసల వర్షం కురిపించారు. శభాష్ నవీన అంటూ అభినందించారు. కానిస్టేబుల్ నవీనకు ప్రశంసా పత్రంతో పాటు రూ. 5 వేల రివార్డును సీపీ అందించారు. బేగంపేట పోలీసు స్టేషన్‌లో నవీన కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఏం జరిగిందంటే..వచ్చే ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఇండియా […]

విధాత: క్రికెట్ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ ఓ మహిళకు సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నవీనపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రశంసల వర్షం కురిపించారు. శభాష్ నవీన అంటూ అభినందించారు. కానిస్టేబుల్ నవీనకు ప్రశంసా పత్రంతో పాటు రూ. 5 వేల రివార్డును సీపీ అందించారు.
బేగంపేట పోలీసు స్టేషన్‌లో నవీన కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఏం జరిగిందంటే..
వచ్చే ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించాలనే కోరికతో టికెట్ల కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
Her prompt assistance saved a life!
— C.V.ANAND, IPS (@CPHydCity) September 23, 2022
Dawa Naveena of Begumpet PS has been felicitated for performing CPR on a woman who was crushed in a stampede outside the Gymkhana ground.#HyderabadPolice pic.twitter.com/EHpQPeaIVy
టికెట్లను కొనుగోలు చేసే క్రమంలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో హౌస్ కీపింగ్ పని చేసే రంజిత చిక్కుకొంది. ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడాన్ని గమనించిన కానిస్టేబుల్ నవీన.. తక్షణమే స్పందించి రంజితకు సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలను కాపాడింది నవీన. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
