విధాత: ఆన్ స్టాపబుల్ కార్యక్రమంలో బాలయ్య, చంద్రబాబులు మాట్లాడుకున్న తీరు.. ముచ్చట్లు మంచి వ్యూస్ సాధించాయి.. అందులో వాస్తవాల సంగతి ఎలా ఉన్నా.. వారి కబుర్లు.. చర్చ మీద ఇంటర్నెట్ సమాజంలో మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ఆరోజుల్లో ఏం జరిగింది అంటూ ఎన్టీయార్ నుంచి పదవిని చేపట్టిన 1995 నాటి ఎపిసోడ్ ను మళ్ళీ గుర్తు చేసుకోవడం దానిమీద ఇద్దరూ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా ఉన్నా.. మరణించిన ఎన్టీయార్ ఇమేజ్ సంగతి వదిలేసి, ఆనాటి ఘటనలో […]

విధాత: ఆన్ స్టాపబుల్ కార్యక్రమంలో బాలయ్య, చంద్రబాబులు మాట్లాడుకున్న తీరు.. ముచ్చట్లు మంచి వ్యూస్ సాధించాయి.. అందులో వాస్తవాల సంగతి ఎలా ఉన్నా.. వారి కబుర్లు.. చర్చ మీద ఇంటర్నెట్ సమాజంలో మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది.

ఆరోజుల్లో ఏం జరిగింది అంటూ ఎన్టీయార్ నుంచి పదవిని చేపట్టిన 1995 నాటి ఎపిసోడ్ ను మళ్ళీ గుర్తు చేసుకోవడం దానిమీద ఇద్దరూ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా ఉన్నా.. మరణించిన ఎన్టీయార్ ఇమేజ్ సంగతి వదిలేసి, ఆనాటి ఘటనలో చంద్రబాబు తప్పు ఏమీ లేదన్నట్లుగా చూపించే ప్రయత్నం చేశారు.

నేను ఎన్టీయార్ కాళ్ళు పట్టుకుని బతిమలాడాను అంటూ చంద్రబాబుతో చెప్పించడం కూడా డ్రమటిక్ గానే అనిపించింది. అంటే పార్టీ గాడి తప్పుతోంది.. అలా కాదు.. ఇలా చేయండి అంటూ ఎన్టీయార్ కాళ్ళు పట్టుకుని చంద్రబాబు బతిమలాడినా ఆయన వినలేదని, చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని, అధికారాన్ని చంద్రబాబు చేపట్టి, పార్టీని కాపాడినట్లుగా ఇప్పుడు జనాన్ని ఒప్పించేందుకు యత్నిస్తున్నట్లుగా ఉంది.


దీంతోబాటు చంద్రబాబు ఆరోజుల్లో కాలేజీల్లో ఎంత హుషారుగా అల్లరి చేసే వారో వివరించబోయారు కానీ అవి వాస్తవానికి దూరంగా ఉన్నాయని ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా వెక్కిరిస్తోంది. ఆరోజుల్లో తాను మోటార్ బైక్స్ సైలెన్సర్ తీసేసి రోడ్ల మీద షికార్లు చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళమని చంద్రబాబు చెప్పడాన్ని వైసీపీ సోషల్ మీడియా ఏకి పారేస్తోంది.

1970ల నాటికి ఓ మోస్తరు పెద్ద రైతు కుటుంబాల్లో సైకిల్ ఉండడమే గొప్ప అని, అప్పటికి కేవలం రెండెకరాల రైతు కుమారుడైన చంద్రబాబు మోటార్ సైకిల్ ఎలా కొన్నారని ప్రశ్నలు వేస్తున్నారు.

మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా చంద్రబాబు ఇమేజిని బిల్డప్ చేయడానికి, ఇంకా ఎన్టీయార్ నుంచి పార్టీని లాక్కోలేదని, ఆనాటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు అలాగే చేసి ఉండకపోతే పార్టీ మిగిలేది కాదని చెప్పడానికే ఈ ఎపిసోడ్ చేసినట్లు వైఎస్సార్సీపీ విమర్శలు గుప్పిస్తోంది.

Updated On 14 Oct 2022 4:14 AM GMT
krs

krs

Next Story