విధాత: నేటి యువతులకు రోల్ మోడల్‌గా సమంతను చెప్పుకోవచ్చు. ఆమె నేటి యంగ్ జనరేషన్‌కి ఓ ఐకాన్. ధీరత్వం, ఆత్మవిశ్వాసం కలగలిసిన ఆమె తన ప్రతిభ, పట్టుదల, పోరాటపటిమ, టాలెంట్‌తో తన సత్తాను చాటుతూ వస్తోంది. తన జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆమె వాటిని ఏమాత్రం బెదురు లేకుండా వాటితో పోరాడుతూనే ఉంటుంది. నిజంగా పోయిన ఏడాది ఆమెకు ఒక చీకటి సంవత్సరమనే చెప్పాలి. ఒకవైపు నాగచైతన్యతో విడాకులు… మరోవైపు మయోసైటీస్ అనే ప్రాణాంతక వ్యాధి […]

విధాత: నేటి యువతులకు రోల్ మోడల్‌గా సమంతను చెప్పుకోవచ్చు. ఆమె నేటి యంగ్ జనరేషన్‌కి ఓ ఐకాన్. ధీరత్వం, ఆత్మవిశ్వాసం కలగలిసిన ఆమె తన ప్రతిభ, పట్టుదల, పోరాటపటిమ, టాలెంట్‌తో తన సత్తాను చాటుతూ వస్తోంది. తన జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆమె వాటిని ఏమాత్రం బెదురు లేకుండా వాటితో పోరాడుతూనే ఉంటుంది.
నిజంగా పోయిన ఏడాది ఆమెకు ఒక చీకటి సంవత్సరమనే చెప్పాలి. ఒకవైపు నాగచైతన్యతో విడాకులు… మరోవైపు మయోసైటీస్ అనే ప్రాణాంతక వ్యాధి ఆమెను అల్లకల్లోలం చేశాయి. ఆమె జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఇదే పరిస్థితి ఇంకెవరికైనా ఎదురై ఉంటే.. ఏం చేసి ఉండేవారో ఇట్టే చెప్పవచ్చు.
కానీ వీటిపై సమంత మాత్రం పోరాడుతూనే ఉంది గాని మడమతిప్పలేదు.. మాట తప్పలేదు. ఇంత బాధలో ఉండి కూడా నేను ఇంకా ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నానని చెబుతూనే కొత్త ఏడాది సందర్భంగా అందరికీ విషెస్‌ను తెలియజేస్తూ అద్భుతమైన ట్వీట్ చేసింది. ఇది గుండెల్ని పిండేసింది.
తాజాగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం నా జీవితం విభిన్నంగా ఉంది. ఇంతకు ముందులా లేదు. అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు, వాళ్లు నాకోసం చేసే ప్రార్థన వల్లే నేను ఇలా ఉన్నాను. అనారోగ్యం కారణంగా కొంతకాలం ఇంటికే పరిమితమయ్యాను…. అంటూ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది.
ఓ నెటిజన్ మేడమ్ మీ జీవితం ఎలా సాగుతోంది అని ప్రశ్నించగా విభిన్నంగా ఉంది అని బదులిచ్చింది సామ్. మరో నెటిజన్ మేడమ్ మీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రతి రోజు కోరుకుంటున్నాను. మళ్ళీ మీరు బాక్సాఫీస్ సక్సెస్ అందుకోవాలి. అలాగే విమర్శలను తిరిగి కొట్టాలి…అని కోరగా మీ ఆశీస్సులు ప్రార్థనలు నాకెంతో అవసరం.
ఇంతకీ విమర్శలను తిప్పి కొట్టాలి అంటున్నారు.. ఇంతకీ అవి ఏ విమర్శలు అంటూ సరదాగా బదులిచ్చింది. ఇక మరో నెటిజన్ మీరు శాకుంతలం ప్రాజెక్టు అంగీకరించడానికి కారణమేమిటి? అని ప్రశ్నించగా త్వరలో మీరే చూస్తారు కదా అని సమాధానం ఇచ్చింది. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న అందరికీ ధన్యవాదాలు తెలిపింది.
ప్రస్తుతం ఈమె మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. మరోవైపు మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ‘శాకుంతలం’లో టైటిల్ పాత్రలో నటిస్తోంది. ఇందులో సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
గుణశేఖర్ టీం వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతుండగా, రుద్రమదేవి దర్శకుడు గుణశేఖర్ దీనికి డైరెక్టర్. ఇప్పటికే పలుమార్లు షూటింగ్ వాయిదా పడింది. అది కూడా కేవలం సమంత అనారోగ్యం వల్లనేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా కూడా ప్రకటించింది. సమంత కూడా ఈ సినిమాకు సంబంధించి తన సైడ్ నుంచి మిగిలి ఉన్న వర్క్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమవుతుందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సామ్ అభిమానులు ట్వీట్స్‌లో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
