Vinayaka Chavithi | హిందువులు ఏ ప‌ని ప్రారంభించాల‌నుకున్నా.. మొద‌ట‌గా వినాయ‌కుడికి పూజ‌లు నిర్వ‌హిస్తారు. ఎందుకంటే.. విఘ్నేశ్వ‌రుడిని పూజిస్తే విఘ్నాలు తొల‌గిపోయి శుభం క‌లుగుతుంద‌నేది న‌మ్మ‌కం. అందుకే వినాయ‌కుడిని పూజిస్తారు. అయితే భాద్ర‌ప‌ద మాసం వినాయ‌కుడి ఆరాధ‌న‌కు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఇక ఈ నెల‌లోనే దేశ‌మంతా వినాయ‌కుడి న‌వ‌రాత్రులు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. ప్ర‌తి గ‌ల్లీలో గ‌ణేషుడి విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించి, భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు నిర్వ‌హిస్తారు. సాక్షాత్తు శివపార్వతుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల […]

Vinayaka Chavithi |

హిందువులు ఏ ప‌ని ప్రారంభించాల‌నుకున్నా.. మొద‌ట‌గా వినాయ‌కుడికి పూజ‌లు నిర్వ‌హిస్తారు. ఎందుకంటే.. విఘ్నేశ్వ‌రుడిని పూజిస్తే విఘ్నాలు తొల‌గిపోయి శుభం క‌లుగుతుంద‌నేది న‌మ్మ‌కం. అందుకే వినాయ‌కుడిని పూజిస్తారు. అయితే భాద్ర‌ప‌ద మాసం వినాయ‌కుడి ఆరాధ‌న‌కు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది.

ఇక ఈ నెల‌లోనే దేశ‌మంతా వినాయ‌కుడి న‌వ‌రాత్రులు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. ప్ర‌తి గ‌ల్లీలో గ‌ణేషుడి విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించి, భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు నిర్వ‌హిస్తారు. సాక్షాత్తు శివపార్వతుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

మ‌రి ఏ స‌మ‌యంలో విఘ్నేశ్వ‌రుడిని ప్ర‌తిష్టించాలి..?

ఈ ఏడాది వినాయ‌క చ‌వితి సెప్టెంబ‌ర్ 18వ తేదీన వ‌చ్చింది. సోమ‌వారం రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు చ‌వితి తిథి ఉంది. కాబ‌ట్టి 11 గంట‌ల నుంచి రెండు గంట‌ల స‌మ‌యం అంటే మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు విఘ్నేశ్వ‌రుడిని ప్ర‌తిష్టించి, పూజించ‌డం మంచిద‌ని వేద పండితులు చెబుతున్నారు. ఇందుకు హిందువులు రెడీ అయిపోతున్నారు. ఇప్ప‌టికే గ‌ణేషుడి ప్ర‌తిమ‌ల‌ను కొనుగోలు చేసి.. మండ‌పాల్లో ఉంచారు.

వినాయ‌కుడు గ‌జాన‌నుడు ఎలా అయ్యాడు..?

కైలాసంలో పార్వ‌తీ దేవి ఒక రోజు స్నానం చేసేందుకు సిద్ధ‌మ‌వుతుంది. అదే స‌మ‌యంలో న‌లుగుతో ఒక బాలుడి రూపాన్ని పార్వ‌తీ దేవీ త‌యారు చేస్తుంది. ఆ న‌లుగు బొమ్మ‌కు ప్రాణ‌ప్ర‌తిష్ట చేసి ద్వారం వ‌ద్ద కాప‌లాగా ఉంచుతుంది. తాను స్నానం చేసి వ‌చ్చే వ‌ర‌కు ఇంట్లోకి ఎవ‌ర్నీ రానివ్వొద్ద‌ని ఆ బొమ్మ‌కు పార్వ‌తీ దేవి చెబుతుంది.

అదే స‌మ‌యంలో శివుడు అక్క‌డ‌కు వ‌స్తాడు. ఇంట్లోకి రానివ్వ‌కుండా అడ్డుకోబోయిన ఆ బాలుడి శిర‌చ్చేద‌నం చేస్తాడు. శివుడు చేసిన ప‌నికి పార్వ‌తీ దేవి ఎంతో దుఃఖిస్తుంది. దీంతో శివుడు గజాసురుని శిరస్సును తెచ్చి ఆ బాలుడికి అతికించి బతికిస్తాడు. అప్పటి నుండే వినాయకుడు గజాననుడు అయ్యాడు.

Updated On 17 Sep 2023 1:41 PM GMT
sahasra

sahasra

Next Story