WhatsApp | ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు వినియోగదారులకు అద్భుతమైన ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఒక ఫోన్‌ నంబర్‌ను కేవలం ఒకే మొబైల్‌లో వాడుకునే అవకాశం ఉండగా.. ప్రస్తుతం పలు డివైజ్‌లలో వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్‌లో ఈ ఫీచర్‌ను రోల్‌ అవుట్‌ చేయనున్నట్లు పేర్కొంది. వాట్సాప్‌ యూజర్లు ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను ఉపయోగించి.. సైన్‌ అవుట్‌ చేయకుండానే మరో ఫోన్‌లో అవకాశం […]

WhatsApp |

ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు వినియోగదారులకు అద్భుతమైన ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఒక ఫోన్‌ నంబర్‌ను కేవలం ఒకే మొబైల్‌లో వాడుకునే అవకాశం ఉండగా.. ప్రస్తుతం పలు డివైజ్‌లలో వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్‌లో ఈ ఫీచర్‌ను రోల్‌ అవుట్‌ చేయనున్నట్లు పేర్కొంది.

వాట్సాప్‌ యూజర్లు ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను ఉపయోగించి.. సైన్‌ అవుట్‌ చేయకుండానే మరో ఫోన్‌లో అవకాశం కలుగనున్నది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు అన్ని పరికరాల్లో ఒకే లెవల్‌లో ప్రైవసీ, సెక్యూనిటీని కొనసాగిస్తూ మెసేజ్‌లు పంపే విధానాన్ని పరిచయం చేయగా.. ప్రస్తుతం మల్టిపుల్‌ డివైజెస్‌లో ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను ఉపయోగించే అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ వాట్సాప్‌ తెలిపింది. త్వరలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

మల్టీఫుల్ డివైజెస్‌లో ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను ఎలా వాడాలి?

వెబ్ బ్రౌజర్లు, టాబ్లెట్లు, డెస్క్‌ టాప్‌ వాట్సాప్‌తో ఎలా లింక్ చేస్తారో అలాగే మీరు మీ ఫోన్‌ని నాలుగు ఇతర డివైజెస్‌కు లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ అకౌంట్‌ను ఎలా కనెక్ట్ చేస్తారో అదే విధంగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

ఆ తర్వాత లింక్డ్‌ డివైజెస్ మీద క్లిక్‌ చేయాలి. ఆ లింక్‌పై ట్యాప్‌ చేయాలి. ఫీచర్‌ను ఎనేబుల్‌ చేయడానికి చేసేందుకు స్క్రీన్‌ మీద కనిపించే సూచనలను పాటించాలి. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయకుండా.. ఫోన్ లింక్‌ను ఓపెన్ చేయడానికి మీ ఫోన్‌కు వన్ టైమ్ కోడ్‌ వస్తుంది. దాన్ని ఉపయోగించుకొని ఇతర డివైజెస్‌కు లించ్‌ చేయాలి. WhatsApp వెబ్‌లో మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్‌ చేయవచ్చు.

ఇక క్యూఆర్‌ కోడ్‌ ఎలా పని చేస్తుంది..

ఫోన్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత లింక్డ్ డివైజెస్ మీద క్లిక్ చేయాలి. ఫోన్‌ను లింక్ చేయడంపై ప్రెస్‌ చేయాలి. ప్రైమరీ ఫోన్‌ని అన్‌లాక్ చేయాలి. ఆ తర్వాత మీరు లింక్ చేయాలనుకుంటున్న ఫోన్ స్క్రీన్‌పై మీ ప్రైవరీ ఫోన్‌ను పాయింట్ చేసి, క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. వాట్సాప్ అకౌంట్ మరో ఫోన్‌తో లింక్ అవుతుంది. ఇలా నాలుగు డివైజెస్‌తో లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

అయితే, లింక్ చేయబడిన ప్రతి ఫోన్ వాట్సాప్‌కు స్వతంత్రంగా కనెక్ట్ అవుతుంది. వినియోగదారు వ్యక్తిగత సందేశాలు, మీడియా, కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయని వాట్సాప్‌ చెప్పింది. ప్రైవరీ డివైజ్ చాలా కాలం పాటు యాక్టివ్‌లో లేకపోతే కనెక్ట్ అయిన మిగతా డివైజెస్ నుంచి ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ చేస్తామని పేర్కొంది. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సరికొత్త మల్టీడివైస్ షేరింగ్ అప్‌డేట్‌ను అందించడం ఇప్పటికే ప్రారంభించామని, మరికొద్ది రోజ్లోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పింది.

Updated On 31 May 2023 1:27 AM GMT
Vineela

Vineela

Next Story