whatsApp Edit Feature | మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువచ్చిన మెటా యాజమాన్యంలో వాట్సాప్.. మరోసారి సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. చాలాకాలంగా యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెసేజ్ ఎడిట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణ యూజర్లందరికీ ఫీచర్ రోల్ అవుట్‌ను ప్రారంభించింది.
15 నిమిషాల్లోగా..
కొద్దివారాల్లో యూజర్లందరకీ ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇక ఈ ఫీచర్ సహాయంతో ఎవరికైనా మెసేజ్‌ను పంపిన సందర్భంలో అందులో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే 15 నిమిషాల్లోగా దాన్ని ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
మెసేజ్‌లో ఏవైనా తప్పులు ఉన్నా ఈ ఫీచర్ సహాయంతో.. మెసేజ్‌ను సెండ్ చేసిన తర్వాత కూడా సరిచేసుకోవచ్చన్నమాట. ఇటీవల వాట్సాప్ బీటా యూజర్లకు టెస్టింగ్ కోసం ఈ ఎడిట్ ఫీచర్ అందుబాటులో ఉంచింది. ఇప్పుటు యూజర్లందరికీ రోల్ అవుట్ ప్రారంభించింది.
IT’S HERE 📣 Message Editing is rolling out now.
You now get up to 15 minutes after sending a message to edit it. So you don’t have to worry if you duck it up 🦆 pic.twitter.com/JCWNzmXwVr
— WhatsApp (@WhatsApp) May 22, 2023
ఎలా ఉపయోగపడుతుందంటే..?
వాట్సాప్‌లో ప్రస్తుతం ఏదైనా మెసేజ్‌ను పంపిన సందర్భంలో తప్పులు ఉంటే ఆ మెసేజ్‌ను డిలీట్ చేసి.. సరి చేసి పంపాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి రావడంతో మెసేజ్ సెండ్ చేసిన తర్వాత సైతం తప్పును సరిదిద్దేందుకు అవకాశం ఉంది.
మెసేజ్ డెలివరీ అయిన 15 నిమిషాల్లోగా ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మెసేజ్‌ను ఎడిట్ చేసిన సందర్భంలో ఎడిటెడ్ అని కనిపిస్తుంది. ఈ ఫీచర్ టెక్ట్స్ మెసేజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.