WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసే మెటా యాజమాన్యంలోని కంపెనీ.. తాజాగా మరో రెండు కీలక అప్‌డేట్స్‌ను తీసుకువచ్చింది. ఇందులో ఒకటి మల్టీ అకౌంట్ (Multi-account). దీంతో ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లను ఉపయోగించుకునే వీలుంటుంది. ప్రైమరీ అకౌంట్ కాకుండా మరో అకౌంట్ కూడా వాట్సాప్‌లో యాడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక రెండో అప్‌డేట్ విషయానికి వస్తే రీడిజైన్డ్ సెట్టింగ్స్ […]

WhatsApp |
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసే మెటా యాజమాన్యంలోని కంపెనీ.. తాజాగా మరో రెండు కీలక అప్‌డేట్స్‌ను తీసుకువచ్చింది. ఇందులో ఒకటి మల్టీ అకౌంట్ (Multi-account).
దీంతో ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్లను ఉపయోగించుకునే వీలుంటుంది. ప్రైమరీ అకౌంట్ కాకుండా మరో అకౌంట్ కూడా వాట్సాప్‌లో యాడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక రెండో అప్‌డేట్ విషయానికి వస్తే రీడిజైన్డ్ సెట్టింగ్స్ ఇంటర్‌ఫేస్. ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు ఈ రెండు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.
మల్టీ అకౌంట్ సపోర్ట్..
సాధారణంగా వాట్సాప్ యూజర్లు ప్రైమరీ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ ఉపయోగించడానికి ప్యార్లల్ (Parallel App) లేకపోతే క్లోన్డ్ యాప్ వినియోగిస్తూ వస్తున్నారు. అయితే, వీటిని వాడడం ప్రమాదకరమే. మరో అకౌంట్ కోసం వాట్సాప్ డ్యుయల్, ప్యార్లల్ వెర్షన్ వాడడం ఇబ్బందిగా ఉంటుంది.
ఈ క్రమంలో వీటికి చెక్ పెడుతూ యూజర్లను దృష్టిలో పెట్టుకొని మల్టీ అకౌంట్‌ను సపోర్ట్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఎడిషనల్ అకౌంట్‌ను వాడుకునేందుకు వేరే డివైజ్ లేదా వేరే అప్లికేషన్ ఉపయోగించకుండానే ఒకే డివైజ్‌లో ఒకే వాట్సాప్ అప్లికేషన్‌లో డిఫరెంట్ అకౌంట్స్‌కు లాగిన్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వాట్సాప్ సెట్టింగ్స్ పేజీకి వెళ్లి అకౌంట్స్‌లోకి వెళ్లాల్సి. అందులో యాడ్ అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి సెకండ్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. ఈ మల్టీ అకౌంట్ ఫీచర్‌తో ఒకే ఆండ్రాయిడ్ డివైజ్‌లో మల్టిపుల్ వాట్సాప్ అకౌంట్స్ మేనేజ్ చేసుకోవచ్చు. సింగిల్ అప్లికేషన్ వేర్వేరు అకౌంట్ల కన్వర్జేషన్లను, నోటిఫికేషన్లను వేర్వేరుగా ఉంచుతుంది.
దీంతో మరొక డివైజ్, థర్డ్‌పార్టీ యాప్స్ అవసరం లేకుండా యాక్సెస్ చేసుకోవచ్చు. లాగవుట్ చేయకుండా, తిరిగి లాగిన్ చేయకుండా ఈజీగా అకౌంట్ల మధ్య స్విచ్ కావచ్చు. ఖాతాలన్నింటికీ ఒకే చోట నోటిఫికేషన్లను రిసీవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, యాప్‌కి ఒక్క అడిషనల్ అకౌంట్‌ను మాత్రమే యాడ్ చేయడానికి వాట్సాప్ అవకాశం కల్పిస్తున్నది. అయితే, భవిష్యత్ అప్‌డేట్‌లో ఈ లిమిట్‌ను పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది.
సెట్టింగ్స్ ఇంటర్‌ఫేస్
వాట్సాప్ సెట్టింగ్స్ ఇంటర్‌ఫేస్‌ను రీడిజైన్ చేస్తోంది. ఇది సెట్టింగ్స్ నావిగేట్ చేస్తున్న సమయంలో యూజర్లకు మరింత అడ్వాన్స్‌డ్ లుక్, ఎక్స్‌పీరియన్స్ అందించనున్నది. అప్‌డేట్‌లో రీడిజైన్డ్ ప్రొఫైల్ ట్యాబ్ కూడా ఉంది. అది ఇప్పుడు చాట్ లిస్ట్‌లోనే ఉంది. దాంతో వినియోగదారులు అనేక మెనూల ద్వారా వెళ్లకుండానే యాప్ సెట్టింగ్స్‌ను సులభంగా ఓపెన్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.23.18.21 వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న చాలామంది బీటా టెస్టర్లకు కొత్త అప్‌డేట్స్ అందుబాటులోకి వచ్చింది. టెస్టింగ్ పూర్తయ్యాక మిగతా యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
