Tuesday, January 31, 2023
More
  Homelatestపవన్‌ని విమర్శించే వారు ఊర కుక్కలతో సమానం: బాలయ్య

  పవన్‌ని విమర్శించే వారు ఊర కుక్కలతో సమానం: బాలయ్య

  విధాత‌: నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ ముద్దుల కుమారుడు. ఎన్టీఆర్ లెగసీని సినిమాల పరంగా బాలయ్య ముందుకు తీసుకొని పోతూ ఉన్నాడు. రాజకీయంగా కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ హిందూపురం నుంచి వరుస విజయాలు సాధిస్తున్నాడు.

  అలాంటి బాలయ్య ప్రస్తుతం ఆహా ఓటిటిలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొట్టమొదటిసారి మన ముందుకు రాబోతున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు పవన్ ఇలాంటి టాక్‌షోలలో పాల్గొనలేదు. దానిపై ఆయనకు ఆసక్తి కూడా లేదు.

  ఇక పవన్ ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి జనసేన అధ్యక్షునిగా వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. మరోవైపు బాలయ్య టిడిపికి చెందిన వాడు. అయితే జనసేన అధినేత ప‌వ‌న్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఎదుర్కొనేందుకు టిడిపి‌తో కలిసి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి.

  ఇలాంటి సందర్భంలో బాలయ్యతో అన్ స్టాపబుల్ షోలో పవన్ కలిసి పాల్గొనడం చాలా ఆసక్తిని కలుగజేస్తోంది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన షూటింగ్ తాజాగా హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది.

  ఎన్నడూ లేని విధంగా ఈ షో నిర్వాహకులు అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి పవన్‌ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ మా షో కి రావడం చాలా ఆనందంగా ఉంది… అని చెప్పుకొచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ కారు దిగగానే బాలయ్య బాబు ఎదురొచ్చి ఆయనను హత్తుకొని గ్రాండ్‌గా వెల్‌కమ్ చెబుతూ సెట్‌ లోపలికి తీసుకొని వెళ్ళాడు.

  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. బాలయ్య లాంటి స్టార్ పవర్ స్టార్ కోసం ఇగో మొత్తాన్ని పక్కనపెట్టి సొంత తమ్ముడిగా ట్రీట్ చేసిన విధానం పవన్ ఫ్యాన్స్ కి ఎంతగానో నచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ ఈ సందర్భంగా బాలయ్య బాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

  ఇక ఈ ఎపిసోడ్ హైలెట్స్ గురించి మాట్లాడుకుంటే పవన్ తో పాటు ఈ ఎపిసోడ్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్‌ వంటి దర్శకులు కూడా హాజరయ్యారని తెలుస్తుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా వస్తాడట. ఈ షోలో బాలయ్య బాబు.. పవన్ కళ్యాణ్ మూడు వివాహాల గురించి ఒక ప్రశ్న అడుగుతాడట.

  ముందుగా బాలయ్య మాట్లాడుతూ ఈ పెళ్లిళ్ల గోల ఏంటయ్యా అని పవన్ కళ్యాణ్ ని అడుగగా.. అప్పుడు పవన్ తాను ఎందుకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో చాలా బాగా వివరంగా చెప్తాడట.

  అదంతా విన్న తర్వాత బాలయ్య బాబు మాట్లాడుతూ.. ఇంత వివరణగా చెప్పిన తర్వాత కూడా ఈ మేటర్ మీద విమర్శించేవాళ్లు ఊర కుక్కలతో సమానం అంటూ ఒక డైలాగ్ పేల్చాడని అనుకుంటున్నారు. ఇలా ఎపిసోడ్ మొత్తం ఇలాంటి మూమెంట్స్ తో నిండి ఉంటుంద‌ని అని ఆహా వారు ఘంటాప‌థంగా చెబుతున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular