Cow Milk |
ఆవు తినేదేమో ఆకుపచ్చ గడ్డి.. మరి దాని పాలేమో తెలుపు రంగులో ఉంటాయి.. అయితే ఈ అంశంపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. నిజంగా ఆకుపచ్చ గడ్డి తిన్న ఆవు.. దాని పాలు కూడా ఆకుపచ్చ రంగులోనే ఉండాలి కదా..? మరి ఆవు పాలు ఎందుకు తెలుపు రంగులో ఉంటాయి..? అనే సందేహాం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ ప్రశ్న కాస్త ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ.. సైన్స్ పరంగా దీనికి కచ్చితమైన సమాధానం ఉంది.
ఆవు కడుపులో పాలు ప్రధానంగా నీటితో పాటు అది తిన్న ఆహారంతో తయారవుతాయి. ఈ పాలల్లో ప్రోటీన్లు, చక్కెర, కొవ్వు మిళితమై ఉంటాయి. ప్రోటీన్లలో ముఖ్యమైనది కేసైన్. మొత్తం ఆవు పాలల్లో 80 శాతం కేసైనే ఉంటుంది. ఇది ఒక ఫాస్పో ప్రోటీన్ కావడంతో.. పాలు తెలుపు రంగులో ఉంటాయి.
పాలపై కాంతి పడినప్పుడు సహజంగానే తెలుపు రంగులో ఉండే కేసైన్ అణువులు చెల్లాచెదురుగా అవుతాయి. 80 శాతం అణువులు ఉంటాయి కాబట్టి.. పాలపై కాంతి పడినప్పుడు ఆ పాలు తెలుపు రంగులోనే కనిపిస్తాయి. పాలు నీటితోనే తయారవుతాయి కాబట్టి.. దాంట్లో నీళ్లు పోసేకొద్ది.. పాలు రంగును కోల్పోయి పలుచగా మారుతాయి. ఎందుకంటే పాలల్లో ఉండే కేసైన్ రేణువులు తగ్గిపోతూ ఉంటాయి. అందుకే నీళ్లు కలపని పాలు కేసైన్‌లతో నిండుగా ఉండి తెల్లగా ఉంటాయి.
అయితే ఆవు లేదా బర్రె పాలు పిల్లల శరీరానికి ఎంతో బలం. శారీరక ధృడత్వాన్ని పెంచుతాయి. పాలల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పాలను రోజు తాగితే శరీరంలో ప్రోటీన్ లోపం ఉండదు. నిద్రలేమి ఉన్న వారు పాలు తాగడం వల్ల.. ఆ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. మానసిక సమస్యలు ఉన్న వారు పాలు తాగితే మంచిది. ఇది డోపమైన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవడానికి సహకరిస్తుంది. ఇది ఉత్పత్తి అయితే మెదడు ప్రశాంతంగా ఉంచుతుంది.