Wednesday, December 7, 2022
More
    HomeBreakingకృష్ణ చనిపోతే.. ఎందుకు బాధ పడుతున్నారు?: RGV

    కృష్ణ చనిపోతే.. ఎందుకు బాధ పడుతున్నారు?: RGV

    విధాత: సాహసానికి మారు పేరైన సూపర్ స్టార్ కృష్ణ మరణంతో.. టాలీవుడ్‌లో ఒక శకం ముగిసినట్లుగా ఇండస్ట్రీ భావిస్తోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ.. ఇలా గోల్డెన్ హీరోలందరూ ఇండస్ట్రీని వదలివెళ్లిపోతుండ‌డంతో ఇండస్ట్రీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్త మరువక ముందే.. సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త వినాల్సి రావడం నిజంగా బాధాకరమైన విషయం.

    సూపర్ స్టార్ మృతికి పలువురు నివాళులు అర్పిస్తుంటే.. సంచలన దర్శకుడు, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ.. కృష్ణగారి మృతితో బాధపడాల్సిన అవసరం లేదంటూ ట్వీట్‌తో షాకిచ్చారు. నిజంగా ఇలాంటి సందర్భంలో కూడా ఆ తరహా ట్వీట్స్ చేయడం ఒక్క వర్మకే సాధ్యం.

    ‘‘సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినందుకు బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. విజయ నిర్మలగారు స్వర్గంలో వేచి చూస్తున్నారు. కృష్ణ, విజయనిర్మల స్వర్గంలో పాటలు పాడుతూ.. నృత్యం చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారని నేను భావిస్తున్నాను..’’ అంటూ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

    ఈ ట్వీట్‌తో పాటు ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రంలోని కృష్ణ, విజయ నిర్మల కలిసి డ్యాన్స్ చేస్తున్న ‘కోరినది నెరవేరినది’ సాంగ్‌ యూట్యూబ్ లింక్‌ను ఆయన పోస్ట్ చేశారు. వర్మ చేసిన ఈ ట్వీట్‌ని చూసిన వారంతా.. ఇలాంటి ట్వీట్స్ చేయడం నీకే సాధ్యం అంటుంటే.. నెటిజన్లు మాత్రం వర్మని కామెంట్లతో గట్టిగానే వేసుకుంటున్నారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page