ఉన్నమాట: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అభివృద్ధి, సంక్షేమం అనే అంశాల‌ను ప‌క్క‌న‌ పెట్టి ప్ర‌జ‌లు తినే తిండి, క‌ట్టుకునే బ‌ట్ట‌, దేవుళ్ల మీద చ‌ర్చ పెట్టింది. ప్ర‌జ‌ల మ‌ధ్య వైష‌మ్యాలు పెంచేలా ఆ పార్టీ నేత‌ల అనేక ప్ర‌క‌ట‌న‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. తాజాగా ఆర్ఎస్ఎస్‌, బీజేపీలు చాప‌కింద నీరులా సంస్కృత‌ భాషను బ‌తికించుకుందామ‌నే పేరుతో మ‌రో ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టాయి. ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో రెండో అధికార భాష‌గా ఉన్న సంస్కృతాన్ని దేశ ప్ర‌జ‌లంద‌రి మీద రుద్దాల‌ని య‌త్నిస్తున్నాయి. […]

ఉన్నమాట: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అభివృద్ధి, సంక్షేమం అనే అంశాల‌ను ప‌క్క‌న‌ పెట్టి ప్ర‌జ‌లు తినే తిండి, క‌ట్టుకునే బ‌ట్ట‌, దేవుళ్ల మీద చ‌ర్చ పెట్టింది. ప్ర‌జ‌ల మ‌ధ్య వైష‌మ్యాలు పెంచేలా ఆ పార్టీ నేత‌ల అనేక ప్ర‌క‌ట‌న‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. తాజాగా ఆర్ఎస్ఎస్‌, బీజేపీలు చాప‌కింద నీరులా సంస్కృత‌ భాషను బ‌తికించుకుందామ‌నే పేరుతో మ‌రో ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టాయి.

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో రెండో అధికార భాష‌గా ఉన్న సంస్కృతాన్ని దేశ ప్ర‌జ‌లంద‌రి మీద రుద్దాల‌ని య‌త్నిస్తున్నాయి. 2023 జనాభా లెక్కలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారమిది. 2023 జనాభా లెక్కలు చివరి దశలో ఉన్నాయి. సమాచారం సేకరించడానికి జ‌నాభా లెక్క‌ల‌ అధికారులు త్వరలో మీ ఇంటికి వ‌స్తారు. మీ మాతృభాష కాకుండా మీరు మాట్లాడే ఇత‌ర‌ భాషల గురించి అడుగుతారు. అప్పుడు దయచేసి 'సంస్కృతం' అని చెప్పండి.

దయచేసి మీకు తెలిసిన/ మాట్లాడే భాషలలో సంస్కృతాన్ని ఒకటిగా పేర్కొనాలని గుర్తుంచుకోండి. మీరు సంస్కృతంలో మాట్లాడ‌లేర‌న్న‌ది నిజ‌మే. అలాగే బహుశా మీరు చదివిన వాటిలో చాలావరకు అర్థం కూడా చేసుకోలేరు. కానీ ఒక‌టి నిజం. మీరు ప్రతిరోజూ సంస్కృతం మాట్లాడుతున్నారు. మీరు దానిని పాడుతూ, జపిస్తూ, ప్రార్థిస్తూ.. ఆ భాషను ఉపయోగించి ఎన్నో కర్మలు చేస్తున్నారు.

మీలో చాలామంది దీనిని పాఠశాలలో నేర్చుకొని ఉండవచ్చు. అట్ల‌నే కొంత‌వ‌ర‌కు చదవగలరు లేదా మాట్లాడగలరని చెప్పు కొస్తున్నారు. అయితే ఆర్ఎస్ఎస్‌, బీజేపీ వాళ్లు ప్ర‌చారం చేస్తున్న‌ట్టు పాడేది, జ‌పించేది, ప్రార్థించేది బ్రాహ్మ‌ణులు త‌ప్పా సామాన్యులెవ‌రూ ఆ భాష‌ను మాట్లాడ‌రు, ఉప‌యోగించ‌రు.

గత జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో కేవలం 2వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నారు. సంస్కృతంతో పోలిస్తే 50,000 మంది అరబిక్, సుమారు12,000 మంది పర్షియన్ మాట్లాడతారని పేర్కొన్నారు. కాబట్టి ఆ భాషలు వాటి అభివృద్ధికి నిధులు పొందుతాయ‌ని మ‌రో వాద‌న‌. నిజానికి మ‌న రాజ్యాంగం గుర్తించిన 24 భాష‌ల‌తో పోల్చ‌వ‌చ్చు. కానీ అర‌బిక్‌, ప‌ర్షియ‌న్ భాష‌ల‌తో పోల్చుతున్నారంటే వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. చారిత్ర‌కంగా ముస్లిం పాల‌కులు భార‌త దేశాన్ని పాలించిన సంగ‌తి తెలిసిందే.

ఆయా కాలాల‌కు అనుగుణంగా నాటి రాజులు ఆ భాష‌ల‌ను త‌మ అధికార భాష‌లుగా ఉప‌యోగించి ఉండ‌వ‌చ్చు. కానీ వాళ్లు కూడా ఆ భాష‌ల్లోనే మాట్లాడాని, చ‌ద‌వాల‌ని నిర్బంధం పెట్ట‌లేదు. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత వివిధ రాష్ట్రాల అధికార భాష‌లు, అక్క‌డి ప్ర‌జ‌లు మాట్లాడుతున్న భాష‌ల గురించి ప్ర‌స్తావించ‌కుండా అర‌బిక్‌, ప‌ర్షియ‌న్ భాష‌లతో సంస్కృతాన్ని పోల్చ‌డ‌మంటే భాష‌ను కూడా భావోద్వేగాలు రెచ్చ‌గొట్ట‌డానికి, త‌ద్వారా రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌డానికి ఆర్ఎస్ఎస్‌, బీజేపీ వాళ్లు చేస్తున్న మ‌రో కుట్ర త‌ప్పా మ‌రేమీ కాదు.

మన సంస్కృతికి పునాది సంస్కృతం అని, అది నెమ్మదిగా మసకబారుతున్న‌ది. ఈ భాష మాట్లాడే వారి సంఖ్య‌ ఇంకా తగ్గితే సంస్కృతం అంతరించి పోయినట్లు ప్రకటించే ప్ర‌మాదం ఉన్న‌ది. కాబ‌ట్టి మన వారసత్వాన్ని సజీవంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉన్న‌ది. జ‌నాభా లెక్క‌ల అధికారులు మీ ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు సంస్కృత పదాన్ని ప్రస్తావిస్తే చాలు. దయచేసి ఈ స‌మాచారాన్ని మీ స్నేహితులందరికీ షేర్ చేయండ‌ని అంటున్నారు. ఈ వాద‌న హాస్యాస్పదంగా ఉన్న‌ది.

ఆ భాష‌ను ఎంత‌మంది మాట్లాడుతున్నారో వారి లెక్క‌ల ప్ర‌కార‌మే చూస్తే ఆ భాష జ‌న‌ బాహుళ్యంలో లేద‌ని అర్థ‌మౌతున్న‌ది. వాడుక‌లో లేని ఆ భాషను ఎవ‌రి కోసం బ‌తికించాల‌ని అనుకుంటున్నారో సంస్కృతం భాషను పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశ‌పెట్టాల‌ని అంటున్న‌ బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌లు చూస్తే అర్థ‌మౌతుంది. ద్ర‌విడ భాష‌లైన తెలుగు, త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం నుంచి వ‌చ్చిన సాహిత్యానికి వంద‌ల ఏళ్ల చ‌రిత్ర ఉన్న‌ది. కోట్లాది మంది ఆ భాష‌ల‌ను మాట్లాడుతున్నారు. వాటి గురించి మాట్లాడ‌కుండా సంస్కృతం, హిందీ గురించి బీజేపీ నేత‌లు ప‌దే ప‌దే మాట్లాడ‌టం వెన‌క వారి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు త‌ప్పా ఆ భాష‌ల అభివృద్ధిపై వారికి ఏ మాత్రం ప్రేమ లేద‌న్న‌ది వాస్త‌వం.

నూతన జాతీయ విద్యా విధానం- 2020లో మాధ్య‌మం, భాషల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం, పాఠశాల విద్య కొత్త పుంతలు తొక్కుతాయి. పేరా 4.11లో సాధ్యమైన చోట, 5వ తరగతి వరకు, అవకాశం ఉంటే 8వ తరగతి దాకా, ఆ తర్వాత కూడా విద్యా మాధ్యమంగా ఇంటిభాష/ మాతృభాష/ స్థానిక భాష/ ప్రాంతీయ భాషలో అమలుచేయాలని సూచించింది.

పేరా 4.13లో త్రిభాషా సూత్రం కొనసాగించబడుతుందని, ఏ మూడు భాషలు అనేది ఆయా రాష్ట్రాలు/ ప్రాంతాల ఇష్టం, విద్యార్థుల అభీష్టానికి వ‌దిలి పెట్టింది. అయితే మూడు భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలై ఉండాలని సూచించింది. కానీ పేరా 4.17లో మూడు భాషల్లో ఒకటిగా సంస్కృతాన్ని స్వీకరించాలని చెప్పింది. ఒక‌వైపు మాధ్య‌మం విష‌యంలో రాష్ట్రాల‌కు స్వేచ్ఛ ఇస్తూనే మ‌రోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్కృత భాష కు గుర్తింపు తెచ్చి, దాన్ని పాఠ‌శాల స్థాయి నుంచే అమ‌లు చేసే ప్ర‌చారం మొద‌లుపెట్టాయి.

మూడు భాషల్లో ఒకటిగా సంస్కృతం ఉండాలని చేసిన సూచనను పాటించాల్సిన అవసరం లేదు. కమ్యూనికేషన్‌కి గానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాలకు గానీ ఉపయోగపడని సంస్కృత భాషను పాఠశాల స్థాయిలోఎందుకు నేర్పాలి ? 2011 జనాభా లెక్కల్లో 24,852 (0.00198) మంది మాత్రమే మాతృభాషగా చెప్పుకున్న అత్యంత మైనార్టీ భాషకు అంత ప్రాధాన్యం ఇవ్వడం బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసం తప్ప విద్యార్థులకు ఏమిటి ప్రయోజనం? భారతీయ సమాజానికి అత్యంత అవమానకరమైన అంటరానితనం, కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్న మనువాద సనాతన సంస్కృతిలో భాగమైన భాషను బ‌ల‌వంతంగా పిల్ల‌ల‌కు నేర్పినా, ప్ర‌జ‌ల‌పై రుద్దినా సమాజానికే నష్టం

Updated On 17 Sep 2022 4:23 AM GMT
krs

krs

Next Story