HomelatestMadhya Pradesh | భార్య కాపురానికి రావ‌డం లేద‌ని.. బావ‌ను చంపిన భ‌ర్త‌

Madhya Pradesh | భార్య కాపురానికి రావ‌డం లేద‌ని.. బావ‌ను చంపిన భ‌ర్త‌

Madhya Pradesh |

డ‌బ్బుల విష‌యంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య చోటు చేసుకున్న గొడ‌వ‌.. ఓ నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ బ‌ద్వానీ జిల్లాలోని పతి గ్రామంలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌తి గ్రామానికి చెందిన జ‌గ‌న్‌కు కొన్ని నెల‌ల క్రితం ఓ యువ‌తితో వివాహ‌మైంది. అయితే అక్క‌డి ఆచార సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి స‌మ‌యంలో వ‌రుడి కుటుంబ స‌భ్యులు వ‌ధువుకు డబ్బు ఇవ్వాలి. ఆ డ‌బ్బుల‌ను వ‌ధువుకు వ‌రుడి కుటుంబ స‌భ్యులు ఇవ్వ‌లేదు. ఈ విష‌యంలో నూత‌న దంప‌తుల మ‌ధ్య చాలా సార్లు గొడ‌వ‌లు చోటు చేసుకున్నాయి.

ఇటీవ‌లే భార్య గొడ‌వ‌ప‌డి త‌న పుట్టింటికి వెళ్లింది. భార్య‌కు న‌చ్చ‌జెప్పి ఇంటికి తీసుకొచ్చేందుకు జ‌గ‌న్ య‌త్నించాడు. కానీ విఫ‌ల‌మ‌య్యాడు. అయితే త‌న భార్య త‌న ఇంటికి రాక‌పోవ‌డానికి కార‌ణం ఆమె సోద‌రుడే అని జ‌గ‌న్ నిర్ధారించుకున్నాడు.

సీన్ క‌ట్ చేస్తే.. బావ నీలేష్, బామ్మ‌ర్ది జ‌గ‌న్ క‌లిసి ఇటీవ‌లే ఫాలియా గ్రామంలో జ‌రిగిన ఓ వివాహ వేడుక‌కు వెళ్లారు. అక్క‌డ నీలేష్ పీక‌ల దాకా మ‌ద్యం సేవించాడు. ఇదే అదునుగా భావించిన జ‌గ‌న్.. మ‌ద్యం మ‌త్తులో ఉన్న నీలేష్‌ను స్థానికంగా ఉన్న ఓ వాగు వ‌ద్ద‌కు తీసుకెళ్లి చంపేశాడు.

నీలేష్ క‌నిపించ‌క‌పోవ‌డంతో.. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. జ‌గ‌న్‌పై అనుమానం రావ‌డంతో లోతుగా ప్ర‌శ్నించ‌డంతో చేసిన నేరాన్ని అంగీక‌రించాడు. త‌న భార్య ఇంటికి రాక‌పోవ‌డానికి ఆమె సోద‌రుడు నీలేష్ ఒక కార‌ణం అని జ‌గ‌న్ పోలీసులు తెలిపాడు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular