విధాత: ఓ వివాహిత పెళ్లికి ముందే ఒకర్ని లవ్ చేసింది. పెళ్లైన తర్వాత కూడా ఆ వ్యక్తితో సంబంధాలు కొనసాగిస్తోంది. అతను కూడా తన ప్రియురాలిని విడిచి ఉండలేక పోతున్నాడు. దీంతో ఆవిడ తన ప్రియుడితో పరార్ అయింది. ఆ తర్వాత ప్రియుడి భార్యను ఆమె భర్త పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత ఘటన బీహార్‌లోని ఖగాడియా జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఖగాడియా జిల్లా చౌథమ్ బ్లాక్‌లోని హార్డియా గ్రామానికి చెందిన ముఖేశ్, నీరజ్ అనే ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు మహిళలతో వివాహమైంది. వీరిద్దరి భార్యల పేర్లు రూబీనే కావడం విశేషం. అయితే నీరజ్ భార్య పెళ్లికి ముందే ముఖేశ్‌తో ప్రేమలో ఉంది.
పెళ్లైన తర్వాత కూడా అతనితో సంబంధాలు కొనసాగిస్తోంది. ముఖేష్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన ప్రియురాలిని మరిచిపోలేని ముఖేష్, తన ముగ్గురు పిల్లలతో పాటు ప్రియురాలిని తీసుకోని గతేడాది ఫిబ్రవరిలో బయటకు వెళ్లి వివాహం చేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న నీరజ్.. తన భార్యపై పస్రాహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు. ముఖేశ్‌ను పిలిచి అడగ్గా, తనకు ప్రియురాలే ముఖ్యమని తెగేసి చెప్పాడు. దీంతో గ్రామ పెద్దలు కూడా ఏం చేయలేకపోయారు.
దీంతో ముఖేశ్ భార్యతో నీరజ్ పరిచయం పెంచుకున్నాడు. ముఖేశ్‌పై ప్రతీకారంగా ఆయన మొదటి భార్యను ఈ నెల 18న వివాహం చేసుకున్నాడు. నీరజ్ ఓ ప్రయివేటు ఉద్యోగి కాగా, ముఖేశ్ దినసరి కూలీ.