Cockatoos | విధాత: ఆడ జీవితో జతకట్టడం కోసం ప్రతి మగ ప్రాణి వివిధ విన్యాసాలు చేస్తూ ఉంటుంది. మనుష జాతితో సహా ప్రతి పక్షి, జంతు జాతిలోనూ ఈ పోకడ కనిపిస్తుంది.కొన్ని మగ పక్షులు ఊలలు వేస్తూ, గాలిలో పల్టీలు కొడుతూ ఆడ పక్షులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే చిలక జాతికి చెందిన మగ పక్షులు ఏకంగా సంగీత కచేరీ నిర్వహించి ఆడ పక్షుల దృష్టిలో పడటానికి ప్రయత్నిస్తాయని ఒక అధ్యయనంలో […]

Cockatoos |
విధాత: ఆడ జీవితో జతకట్టడం కోసం ప్రతి మగ ప్రాణి వివిధ విన్యాసాలు చేస్తూ ఉంటుంది. మనుష జాతితో సహా ప్రతి పక్షి, జంతు జాతిలోనూ ఈ పోకడ కనిపిస్తుంది.కొన్ని మగ పక్షులు ఊలలు వేస్తూ, గాలిలో పల్టీలు కొడుతూ ఆడ పక్షులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
అయితే చిలక జాతికి చెందిన మగ పక్షులు ఏకంగా సంగీత కచేరీ నిర్వహించి ఆడ పక్షుల దృష్టిలో పడటానికి ప్రయత్నిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. వాటి అభిరుచిని బట్టి వాయించడానికి వీలైన పరికరాలను స్వయంగా తయారుచేసుకుంటాయని వెల్లడైంది. ఆస్ట్రేలియాకు చెందిన వైల్డ్ పామ్ కొకటోస్‌పై చేసిన ఈ పరిశోధన వివరాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ రాయల్ సొసైటీ బీ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వాటి ప్రకారం..
ఈ కొకటోస్ పక్షులు జత కట్టే వయసుకు వచ్చాక ఆడ పక్షులకు ఆకర్షించడానికి తమ అభిరుచిని బట్టి మ్యూజిక్‌ను వినిపిస్తాయి. కొన్ని లావుగా ఉండి పొట్టిగా ఉన్న చిన్నపాటి కర్రముక్కను, మరొకొన్ని సన్నగా పొడుగ్గా ఉన్న కర్రముక్కలను ఎంచుకుంటాయి. ఈ జాబితాలో గుండ్రటి రాళ్లు, పెంకులు కూడా ఉంటాయి. ఆకులు అదీ లేకుండా బాగా కనపడే ఒక కొమ్మపై కూర్చుని ఒక కాలితో ఆ ముక్కను పట్టుకుని కొమ్మపై కొడుతూ దరువేస్తాయి.
అలా దరువేస్తూ అరుస్తూ సందడిగా గాన కచేరీ చేస్తాయి. తన వైపు ఆడపక్షి ఏదైనా ఆకర్షితురాలైతే ఆ వాయిద్యాన్ని అక్కడే పడేసి వెళ్లిపోతాయి. సుమారు రెండేళ్లుగా ఆస్ట్రేలియాలోని కుతిని, పయామూ నేషనల్ పార్క్, చుట్టుపక్కల ఉన్న అబోరిజినల్ ల్యాండ్‌లలో పరిశోధకులు ఇలాంటి వాయిద్యాల కోసం గాలించారు. వారికి 227 రకాలు కర్రపుల్లలు, 29 విత్తనపు ఉండలు, కనిపించాయి.
ఈ కొకటోస్‌లో ఒక విచిత్ర లక్షణాన్ని కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు. మ్యుజిషియన్స్ గిటార్ వాయించినపుడు ఆ ఉద్రేకంలో లేదా ఆనందంలో కచేరీ చివర్న దానిని విరిచేస్తారు. అదే తరహాలో ఆడపక్షి దొరకగానే తాను వాయించిన కర్ర వాయిద్యాన్ని మగ కొకటోస్ ఆనందంతో విరిచేస్తుందని గుర్తించామని పేర్కొన్నారు.
పైగా ఇవి దొరికాయి కదా అని ఏ పుల్ల పడితే ఆ పుల్లతో వాయించవని.. తమ అభిరుచికి తగ్గ కర్ర దొరికేకానే పని మొదలుపెడతాయని తెలిపారు. ఇలా మ్యూజిక్‌తో జతను ఆకర్షించడం పక్షుల్లో కనుగొన్నది బహుశా ఇదే తొలిసారని అధ్యయనానికి నేతృత్వం వహించిన హెయిన్‌సాన్ వివరించారు.
