విధాత: దేశవిదేశాల్లో పోర్టులు.. గనులు.. విమానాశ్రయాలను.. విద్యుత్ కేంద్రాలు..ఇలా లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న ఆదాని గ్రూపులో మొత్తం డొల్ల అంటూ అమెరికాకు చెందిన హిడెన్ బర్గ్ అనే మార్కెట్ విశ్లేషణ సంస్థ ఇచ్చిన నివేదికతో ఆదాని గ్రూపు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. వారం రోజుల్లోనే ఆ సంస్థకు చెందిన షేర్లు అమాంతం కిందికి జారిపోయాయి.వేలకోట్ల సంపద రోజుల్లోనే మాయమైంది. అయితే ఇదే తరుణంలో తాము నిజాయితీగా వ్యాపారం చేస్తున్నామని, టెక్మ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కొన్ని […]

విధాత: దేశవిదేశాల్లో పోర్టులు.. గనులు.. విమానాశ్రయాలను.. విద్యుత్ కేంద్రాలు..ఇలా లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న ఆదాని గ్రూపులో మొత్తం డొల్ల అంటూ అమెరికాకు చెందిన హిడెన్ బర్గ్ అనే మార్కెట్ విశ్లేషణ సంస్థ ఇచ్చిన నివేదికతో ఆదాని గ్రూపు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. వారం రోజుల్లోనే ఆ సంస్థకు చెందిన షేర్లు అమాంతం కిందికి జారిపోయాయి.వేలకోట్ల సంపద రోజుల్లోనే మాయమైంది. అయితే ఇదే తరుణంలో తాము నిజాయితీగా వ్యాపారం చేస్తున్నామని, టెక్మ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కొన్ని విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయంటూ ఆదాని గ్రూప్ ఓ ప్రకటన చేస్తూనే మార్కెట్ నుంచి అంటే ప్రజల నుంచి మళ్ళీ భారీగా డబ్బు సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

పబ్లిక్ ఇష్యు ద్వారా 20 వేలకోట్లు సమీకరించేందుకు ప్లాన్ వేసింది. అయితే ఇప్పటికే ఎస్బిఐ, ఎల్ఐసి వంటి సంస్థల డబ్బు ఆదానిలో పెట్టగా ఆ షేర్లు నెల చూపులు చూస్తున్న తరుణంలో మళ్ళీ ప్రజలు ఆదాని షేర్లు కొంటారా అనే సందేహాలు వస్తున్నాయి. ఒకవైపు కంపెనీ షేర్స్ పతనం అవుతుండగా మరోవైపు అదానీ వ్యాపారాలకు మూల కేంద్రమైన అదానీ ఎంటర్ ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో)కు వచ్చింది. సుమారు 20వేల కోట్ల సమీకరణ కోసం జనవరి 27 నుంచి ఎఫ్పీవోకు వచ్చింది. ఈ ఇష్యూ మంగళవారంతో ముగియనుంది.

అయితే తొలి రోజు కేవలం ఒక శాతం మాత్రమే బుక్ అయినట్టు సమాచారం అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్స్ కొన్న వారికి వంద శాతం బుక్ బిల్డింగ్ కింద పార్ట్ లీ పెయిడ్ షేర్లను కంపెనీ జారీ చేస్తోంది. ఒక్కో షేరుకు రూ.3112 నుంచి 3276 ప్రైస్ బ్యాండ్తో ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం ఒక్కొక్కరూ కనీసం నాలుగు షేర్లు కొనాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 8 నుంచి ఈ షేర్లు ట్రేడ్ అవుతాయి. ఇటీవల ఆ కంపెనీ సంక్షోభం గురించి బయటపడటంతో ఒక్కో షేర్ కోసం రూ. 3112 నుంచి 3276 ప్రైస్ బ్యాండ్ పెట్టినా ప్రస్తుతం షేర్ ధర మాత్రం 2768 దగ్గరే ట్రేడ్ అవుతోందట. ఇది కూడా మరింత కిందికి దిగిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

సోమ మంగళ వారాలు అదానీ గ్రూపునకు అత్యంత కీలకమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 20వేల కోట్ల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకు వచ్చిన అదానీ ఎంటర్ప్రైజెస్ అనుకున్నట్లు మార్కెట్ ను శాసిస్తుందా? లేదా అన్నది త్వరలోనే తేలనుంది. మరో వైపు ఆదాని తాము భారత దేశ సమగ్రతను గౌరవిస్తాం అని చెబుతూ ఇది తమ మీద జరిగిన దాడి కాదని యావత్ భారత పరిశ్రమల మీద జరిగిన అనైతిక దాడి అని చెబుతోంది. బిజెపి సానుభూతి పరులు మాత్రం మోడీ సారథ్యంలోని భారత్ ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్న తరుణంలో పాశ్చాత్య మీడియా, పెట్టుబడిదారులు అంతా ఏకమై కావాలనే భారత ఇమేజిని దెబ్బ తీస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా ఆదానిలో షేర్లు కొన్న పెట్టుబడిదారులు మాత్రం భారీగా నష్టపోవడం మాత్రం జరిగింది.

Updated On 30 Jan 2023 10:53 AM GMT
Somu

Somu

Next Story