ఉన్నమాట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాదాపు నాలభయ్యేళ్లు పాలించిన కాంగ్రెస్ గత పదేళ్లుగా ఇక్కడ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన, వైఎస్ జగన్‌ను పార్టీ నుంచి బయటకు పంపడం.. ఆయన సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని ఎదగడం ఇత్యాది పరిణామాలు కాంగ్రెస్‌ను పూర్తిగా కుంగదీశాయి. గత రెండు అసెంబ్లీ 2014, 2019 ఎన్నిక్షల్లో ఎక్కడా ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అసలు ఏపీ కాంగ్రెస్‌కు దిక్కూ దివాణం లేకుండా పోయింది. పార్టీని నడిపే వాళ్ళు […]

ఉన్నమాట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాదాపు నాలభయ్యేళ్లు పాలించిన కాంగ్రెస్ గత పదేళ్లుగా ఇక్కడ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన, వైఎస్ జగన్‌ను పార్టీ నుంచి బయటకు పంపడం.. ఆయన సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని ఎదగడం ఇత్యాది పరిణామాలు కాంగ్రెస్‌ను పూర్తిగా కుంగదీశాయి.

గత రెండు అసెంబ్లీ 2014, 2019 ఎన్నిక్షల్లో ఎక్కడా ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అసలు ఏపీ కాంగ్రెస్‌కు దిక్కూ దివాణం లేకుండా పోయింది. పార్టీని నడిపే వాళ్ళు కరువయ్యారు. జిల్లా కమిటీలు లేవు.. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో అయినా పార్టీ ఖాతా తెరుస్తుందా అన్న సందేహాలు అలాగే ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలకమైన ప్రకటనలు చేశారు. రాజధాని అమరావతికే తాము మొగ్గు చూపుతామని.. ఇక్కడి రైతులకు.. తాము అండగా ఉంటామని.. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూడా తమదేనని అన్నారు.

కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే.. ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా.. ఒక పార్టీగా 2014లో ఇచ్చిన హామీలు కావని పార్లమెంటు సాక్షిగా.. ఏపీకి దక్కిన హక్కులని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో.. రాజధాని రైతులతోనూ.. ఇతర ప్రజా సంఘాల నాయకుల తోనూ.. ఆయన చర్చించారు. సమస్యలు విన్నారు. వారికి ఓదార్పు ఇచ్చే వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి రాహుల్ రాష్ట్రంలో పాదయాత్ర చేసింది కేవలం కర్నూలు జిల్లాకే పరిమితం అయినా.. అది కూడా.. అతి తక్కువ రోజులే.. అయినా… రాహుల్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కీలకంగా మారాయి. వాస్తవానికి ఆంధ్రాలో ఇప్పటికి కాంగ్రెస్‌కు ప్రజల్లో ఎంతో కొంత ఆదరణ ఉంది కానీ పార్టీని నడిపించే నాయకులు, కార్యకర్తలు లేకుండా పోయారు.

రాహుల్ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా మద్దతు పొందేందుకు కార్యాచరణ కూడా రూపొందించే వాళ్ళు లేక పోయారు.. అయితే రాహుల్ వెంట ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున నడిచారు. రాహుల్‌తో మాటా మంతి, చర్చలు, ఫోటోలు వంటి వాటికి ప్రజలు.. ముఖ్యంగా యువత ఆసక్తి చూపారు.

అయితే.. ఆదిశగా కార్యక్రమాలు చేసే కార్యకర్తలు.. సొమ్ములు ఖర్చు చేసే నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. ఎందుకంటే.. ఇటీవల రాహుల్ పాదయాత్ర నిర్వహించడానికే తమ దగ్గర డబ్బులు లేవని.. పార్టీ నాయకులు చేతులు ఎత్తేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలూదే అవకాశం ఉందా.. ఇప్పటికి చిక్కి శల్యమైన కాంగ్రెస్ ఇక శాశ్వత సమాధిలోకి వెళ్లిపోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated On 25 Oct 2022 11:50 AM GMT
krs

krs

Next Story