గూగుల్ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు సెర్చ్ ఇంజ‌న్ కూడా మూత ప‌డ‌వ‌చ్చ‌నే భ‌యాలు అద్భుత ఆవిష్క‌ర‌ణా.. మాన‌వ మేధ మ‌నుగ‌డ‌కు ముప్పా..? విధాత: చాట్ జీపీటీ (chat GPT) రానున్న రోజుల్లో గూగుల్‌ను మ‌రుగున ప‌డేస్తుందా.. అంటే సాంకేతిక నిపుణుల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తున్న‌ది. ఇవ్వాళ… ఏవిధంగానైతే మ‌నిషికి తోడుగా, అండ‌గా, ఓ మార్గ నిర్దేశ‌కంగా గూగుల్ సాయ‌ప‌డుతున్న‌దో.., అంత‌కు మిన్న‌గా చాట్ జీపీటీ నిలువ‌బోతున్న‌ద‌ని అంటున్నారు. జీమెయిల్ సృష్టిక‌ర్త పాల్ బుఖే నే స్వ‌యంగా […]

  • గూగుల్ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు సెర్చ్ ఇంజ‌న్ కూడా మూత ప‌డ‌వ‌చ్చ‌నే భ‌యాలు
  • అద్భుత ఆవిష్క‌ర‌ణా.. మాన‌వ మేధ మ‌నుగ‌డ‌కు ముప్పా..?

విధాత: చాట్ జీపీటీ (chat GPT) రానున్న రోజుల్లో గూగుల్‌ను మ‌రుగున ప‌డేస్తుందా.. అంటే సాంకేతిక నిపుణుల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తున్న‌ది. ఇవ్వాళ… ఏవిధంగానైతే మ‌నిషికి తోడుగా, అండ‌గా, ఓ మార్గ నిర్దేశ‌కంగా గూగుల్ సాయ‌ప‌డుతున్న‌దో.., అంత‌కు మిన్న‌గా చాట్ జీపీటీ నిలువ‌బోతున్న‌ద‌ని అంటున్నారు. జీమెయిల్ సృష్టిక‌ర్త పాల్ బుఖే నే స్వ‌యంగా చాట్ జీపీటీతో గూగుల్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారంటే… దాని శ‌క్తి సామర్థ్యాల‌ను ఊహించుకోవ‌చ్చు.

చాట్ జీపీటీ (చాట్ జ‌న‌రేటివ్ ప్రి ట్రెయిన్డ్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌)గా పిలుస్తున్న ఇది ఒక బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి. అలాగే.. దీన్ని ఓ భాషా యంత్రంగా చెప్ప‌వ‌చ్చు. 2022 న‌వంబ‌ర్ లో ఓపెన్ ఏ1 సంస్థ దీన్ని ప్రారంభించింది. ఇది ఉనికిలోకి వ‌చ్చిన లేదా ఆవిష్క‌రించిన వారం రోజుల్లోనే ప‌ది ల‌క్ష‌ల మంది యూజ‌ర్ల‌ను పొంది సంచ‌ల‌నం సృష్టించింది. చాట్ జీపీటీ ప‌నివిధానంతో గూగుల్ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు అయిన సెర్చ్ ఇంజ‌న్ కూడా మూత ప‌డ‌వ‌చ్చ‌నే భ‌యాలు, అంచ‌నాలు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

నేటి ఆధునిక ప్ర‌పంచానికి గూగుల్ ఇవ్వాళ అతిపెద్ద వ‌న‌రు. ఏం కావాల‌న్నా గూగుల్‌పైనే ఆధార‌ప‌డే ప‌రిస్థితి ఉన్న‌ది. అంటే.. ఆ స్థాయిలో మాన‌వ అవ‌స‌రాల‌ను తీరుస్తున్న‌ది. అవ‌స‌ర‌మైన స‌మ‌గ్ర స‌మాచారాన్ని క్ష‌ణాల్లో కండ్ల‌ముందు ఉంచుతున్న‌ది. అనువాదం మొద‌లు… క్లిష్ట ప‌దాల‌కు అర్థాలు తెలప‌డం దాకా.. జాతీయ అంత‌ర్జాతీయ ప‌టాలు, అందులోని భౌగోళిక సూక్ష్మ స్థాయి వివ‌రాలు గూగుల్ అందిస్తున్న‌ది.

అయితే.. జీపీటీ మ‌రో అడుగు ముందుకేసింది. ఇది మ‌నిషిని అనుక‌రించి తిరిగి స‌మాధాన‌మిస్తుంది. అలాగే అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని ఇచ్చే కృత్రిమ మేధ‌స్సుకు ప్ర‌తీక‌. దీనికి ప‌దాల అర్థం తెలవ‌క పోయినా.., ఆ ప‌దాల వినియోగాన్ని బ‌ట్టి తిరిగి దానికి స‌మాధాన‌మిస్తుంది. ఈ క్ర‌మంలోనే.. చాట్ జీపీటీ మ‌నం అడిగిన ప్ర‌తి ప్ర‌శ్న‌కూ స‌మాధానం చెప్తుంది. అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వ‌ట‌మే కాకుండా.. ఇంత‌కు ముందే చాట్ జీపీటీ వ‌ద్ద ఉన్న స‌మాచారంతో విశ్లేషించి మ‌నం అడిగిన ప్ర‌శ్న‌కు వివ‌ర‌ణాత్మ‌క సమాధానం చెప్తుంది.

అంతేకాదు… చాట్ జీపీటీ మ‌న‌కు కావాల్సిన వ్యాసాల‌ను రాసిస్తుంది. విద్యార్థుల‌కు ప‌రిశోధ‌క వ్యాసాల‌ను కూడా రాసి ఇస్తుంది. మ‌న‌కు కావాల్సిన పాట‌లు, క‌విత‌లు రాస్తుంది. అతిపెద్ద స‌మాచారాన్ని సంక్షిప్తీకరిస్తుంది. క్లుప్త స‌మాచారాన్ని వివ‌ర‌ణాత్మ‌క స‌మ‌గ్ర వ్యాసంగా మ‌లిచి అందిస్తుంది. పాట‌ల‌కు అవ‌స‌ర‌మైన సంగీతాన్ని కూడా అందిస్తుంది.

అయితే… ఒక్కోసారి చాట్ జీపీటీ క‌చ్చిత‌త్వ‌మే దానికి అవ‌రోధంగా మ‌రుతున్న స్థితి ఉన్న‌ది. మ‌నం అడిగిన ప్ర‌శ్న‌కు సూటియైన స‌మాధానం ఇచ్చే బ‌దులు, దాని ద‌గ్గ‌ర ఉన్న విస్తార స‌మాచారంతో ప‌దాల వినియోగంపై ఆధారప‌డి ఇచ్చే స‌మాధానం ఒక్కోసారి త‌ప్పుడుదిగా ఉంటున్న‌ది.

చాట్ జీపీటీ గురించి ప్ర‌ఖ్యాత సాంకేతిక నిపుణులు, శాస్త్ర‌వేత్త‌ల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొంద‌రు దీన్ని అద్భుత మాన‌వ ఆవిష్క‌ర‌ణగా అభివ‌ర్ణిస్తే…, మ‌రి కొంద‌రు మాన‌వ మేధా మ‌నుగ‌డ‌కు పెను ముప్పు అంటున్నారు.

Updated On 28 Jan 2023 11:53 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story