విధాత‌: బాలీవుడ్‌లో వరుసగా హీరోయిన్లు పెళ్లి పీటలెక్కుతున్నారు. కత్రినా కైఫ్, కియారా అద్వానీ, ఆలియా భట్, అతియా శెట్టిలతోపాటు మరికొంతమంది పెళ్లి పీటలెక్కారు. వీరందరి పెళ్లిళ్లు చూసిన త‌ర్వాత ఓ హీరోయిన్ తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది. నేను ఏ రిలేష‌న్‌లోనూ లేను.. మింగిల్ కావడానికి ఎవరైనా ఉన్నారా? నన్ను ఎవ‌రైనా పెళ్లి చేసుకుంటారా? అంటూ కుర్రాళ్లకు క్రేజీ ఆఫర్ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా?.. పరిణితి చోప్రా. […]

విధాత‌: బాలీవుడ్‌లో వరుసగా హీరోయిన్లు పెళ్లి పీటలెక్కుతున్నారు. కత్రినా కైఫ్, కియారా అద్వానీ, ఆలియా భట్, అతియా శెట్టిలతోపాటు మరికొంతమంది పెళ్లి పీటలెక్కారు. వీరందరి పెళ్లిళ్లు చూసిన త‌ర్వాత ఓ హీరోయిన్ తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది.

నేను ఏ రిలేష‌న్‌లోనూ లేను.. మింగిల్ కావడానికి ఎవరైనా ఉన్నారా? నన్ను ఎవ‌రైనా పెళ్లి చేసుకుంటారా? అంటూ కుర్రాళ్లకు క్రేజీ ఆఫర్ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా?.. పరిణితి చోప్రా.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తన అందంతో ఇండస్ట్రీని షేక్ చేసింది. పలు హిట్ చిత్రాల‌లో న‌టించి స్టార్ డ‌మ్ చవిచూసింది. ప్రస్తుతం వ‌రుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ బాలీవుడ్‌లో జరుగుతున్న పెళ్లిళ్లు చూస్తుంటే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది.

ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను.. త్వరలో మింగిల్ అవ్వాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఆలియా, కియారా, అతియాశెట్టిల ఫోటోలు చూస్తుంటే నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మంచి అబ్బాయి ఉంటే చూడండి.. అంటూ నవ్వుతూ కుర్రాళ్లకు వలపు వల విసిరింది.

స్టార్ హీరోయిన్లే కాదు.. ఈ మధ్య బాలీవుడ్‌లో చిన్న చిన్న నటీమణులు కూడా కామ్‌గా పెళ్లి కానిచ్చేస్తు న్నారు. అదేమంటే.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలిగా అంటున్నారు. మ‌రిప్పుడు పరిణితి చోప్రా ఆఫ‌ర్ చూసి ఎంతమంది స్పందిస్తారో వేచి చూడాలి.

Updated On 26 Feb 2023 6:00 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story