విధాత, మెదక్ బ్యూరో: అనారోగ్యంతో పార్టీ కార్యకర్తల మృతి విషయం తెల్సుకుని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధిపేట నారాయణ రావుపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామ బీఆర్ఎస్ కార్యకర్త మొలుగు బుగ్గయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. ఈ మేరకు ఇబ్రహీంపూర్‌లోని వారి నివాసంలో ఆ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని ఆ కుటుంబానికి మంత్రి ధీమాఇచ్చారు.
అలాగే మండల కేంద్రమైన నారాయణరావుపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షురాలు పద్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. అనంతరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి అన్నీ విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబీకుల్లో మనోధైర్యాన్ని నింపారు.