Singareni గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగేనా? రెండేళ్లుగా యజమాన్యం వాయిదా అక్టోబర్ 28 న నిర్వహణకు నిర్ణయం టీబీజీకేఎస్ ఓటమి పాలైతే ? డోలాయమానంలో అధికార పక్షం కోల్ బెల్ట్ ప్రాంతాల్లో 12 అసెంబ్లీ స్థానాలు విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రాజకీయ రొచ్చులో చిక్కుకున్నాయి. యాజమాన్యం ఎన్నికలకు సన్నద్ధమైంది. అక్టోబర్ 28న నిర్వహిస్తామని ఇప్పటికే నిర్ణయించింది. ఈ ఎన్నిక త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ఈ […]

Singareni
- గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగేనా?
- రెండేళ్లుగా యజమాన్యం వాయిదా
- అక్టోబర్ 28 న నిర్వహణకు నిర్ణయం
- టీబీజీకేఎస్ ఓటమి పాలైతే ?
- డోలాయమానంలో అధికార పక్షం
- కోల్ బెల్ట్ ప్రాంతాల్లో 12 అసెంబ్లీ స్థానాలు
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రాజకీయ రొచ్చులో చిక్కుకున్నాయి. యాజమాన్యం ఎన్నికలకు సన్నద్ధమైంది. అక్టోబర్ 28న నిర్వహిస్తామని ఇప్పటికే నిర్ణయించింది. ఈ ఎన్నిక త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో అధికార పక్షం డోలాయమానంలో పడింది. బీఆర్ఎస్ కు లాభమా? నష్టమా? అంటూ అధిష్టానం సమాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రభావం ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలపై పడనుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర సర్కార్ సింగరేణి ఎన్నిక నిర్వహిస్తుందా? అనే సందేహాలు నెలకొన్నాయి.
సింగరేణి 11 ఏరియాల్లో 42 వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కోల్ బెల్ట్ ఏరియాలోని ప్రజాప్రతినిధులు కార్మికుల సంక్షేమాన్ని మరిచారని ఆ వర్గం ఇప్పటికే గుర్రుగా ఉంది. 11వ వేజ్ బోర్డు 23 నెలల అరియర్స్ ఒక్కొక్క కార్మికునికి కనీసం 3 నుంచి 4 లక్షల చెల్లించి, ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.
బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ కు కార్మికులు మద్దతిస్తారని ధీమాతో గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కార్మికులు అనుకుంటున్నారు. ఒకవేళ ఎన్నికల్లో టీబీజీకేఎస్ ను కార్మికులు ఆదరించకపోతే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఒకవేళ అలా జరిగితే పరిస్థితి ఏమిటని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుండి కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు తమ యూనియన్ నాయకత్వాన్ని బలపర్చకపోతే పరిస్థితి ఏంటని సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
కార్మికులను అనుకూలంగా మార్చుకునే యత్నం
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇతర సంఘాలు గెలిస్తే తెలంగాణలో రాజకీయ సమీకరణ ఎలా ఉంటుందో అని కొంత విశ్లేషణ చేస్తున్నట్లు సమాచారం. సింగరేణి కార్మికులకు ఈ మూడు నెలల్లో ఈ నెల 21న అరియర్స్ దాదాపు 3 నుంచి 4 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
దసరా పండుగ సందర్భంగా అడ్వాన్స్ దాదాపు 30 నుండి 40 వేల రూపాయలు, లాభాల వాటా 35% అవి దాదాపు లక్ష యాబది వేల రూపాయలు డబ్బులు వస్తున్న నేపథ్యంలో కొంత టీబీజీకేఎస్ కు కొంత అనుకూలత వస్తుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక వైపు అయితే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల పెడుతామన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు రాకపోతే, దాని ఫలితాలు పర్యవసనం ఏమిటని సర్కారు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తేనే, ఎఫెక్ట్ తెలంగాణ ప్రాంతంలో వ్యాపించి ఆపార్టీ గ్రాఫ్ పెరిగింది. పక్క రాష్ట్రంలో గెలిస్తేనే అంత ప్రభావం ఉంటే, ఉత్తర తెలంగాణలోని సింగరేణి ఎన్నికలో టీజీబీఎస్ యూనియన్ కు ఆశించిన మేర ఫలితాలు రాకపోతే ప్రభావం ఎలా ఉంటుందో అంటూ టీబీజీకేస్ , బీఆర్ఎస్ పార్టీ తర్జనభజన పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో మూడుసార్లు వాయిదాలు వేస్తూ వస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహించాలని కోర్టు సూచన చేసినప్పటికీ సింగరేణి యాజమాన్యం పలు కారణాలతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. ఈనెల 22న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక మరేమైనా కారణాలతో వాయిదా వేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే?
