విధాత: మునుగోడు ముగిసింది గానీ.. బీజేపీలో గోడు రెట్టింపయ్యింది. ఆ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ తన వాట్సప్‌ యూనివర్సిటీ ద్వారా సృష్టించిన కళాకండాలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఓ సందర్భంలో రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు జరుగుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ మధ్య మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ బంపర్ మెజారిటీ సాధిస్తుందని, అనంతరం అధికార పార్టీ నుంచి […]

విధాత: మునుగోడు ముగిసింది గానీ.. బీజేపీలో గోడు రెట్టింపయ్యింది. ఆ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ తన వాట్సప్‌ యూనివర్సిటీ ద్వారా సృష్టించిన కళాకండాలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఓ సందర్భంలో రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు జరుగుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ మధ్య మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ బంపర్ మెజారిటీ సాధిస్తుందని, అనంతరం అధికార పార్టీ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలు కాషాయ తీర్థం పుచ్చుకుంటారని ఆ పార్టీ నేతలతో పాటు మరికొంతమంది భావించారు.

ముఖ్యంగా ఉప ఎన్నిక సందర్భంగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదం అయింది. ఆయన తమ్ముడికి మేలు చేయబోయి లేని కష్టాలను కోరి తెచ్చుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఉప ఎన్నిక కు ముందు. ఆయనకు ఇచ్చిన విలువ ఇప్పుడు కూడా ఇస్తుంది అనుకోలేము.

వెంకట్ రెడ్డి షోకాజ్ నోటీసులపై నిన్న జై రాం రమేష్ వ్యాఖ్యలు చూసిన తర్వాత అది స్పష్టమైంది. ఈ వివాదం ముగిసి పొకముందే బీజేపీ వాట్సప్ వర్సిటీ మరో అంశాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నది. వెంకట్ రెడ్డితో రాజీనామా చేయించి ప్రతీకారం తీర్చుకోవడానికి బీజేపీ సిద్ధమైందనే ప్రచారం మొదలు పెట్టింది.

ఇందులో వాస్తవం ఎంత అన్నది వెంకట్ రెడ్డి స్పందిస్తే గాని మనకు అసలు విషయం తెలియదు. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. తమ్ముడికి సపోర్ట్ చేశాడు అనే ఆరోపణలు ఆయనను ఉక్కిరబిక్కిరి చేస్తున్నాయి. అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరగా.. ఆయన సమాధానం కూడా ఇచ్చారు.

ఆ సమాధానం సంతృప్తికరంగా లేకుంటే చర్యలు తప్పవని కరాఖండిగా చెప్పింది. పాల్వాయి స్రవంతి కూడా తన ఓటమికి వెంకట్ రెడ్డి కోవర్ట్ రాజకీయమే కారణమని ఆరోపించింది. ఇన్ని సమస్యలు, విమర్శలు ఎదుర్కొంటున్న వెంకట్ రెడ్డి నిజంగానే బీజేపీ వాట్సప్ వర్సిటీ వాళ్ళు ప్రచారంలో పెట్టిన వార్త ను నిజం చేసే సాహసం చేస్తారా? రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక తెచ్చే నిర్ణయం తీసుకుంటారా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలుతుంది.

Updated On 9 Nov 2022 2:09 PM GMT
krs

krs

Next Story