Mamata Banerjee దుబాయ్‌: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. విక్రమసింఘేను మమతాబెనర్జీ బుధవారం దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో కలిశారు. కోల్‌కతాలో జరిగే వాణిజ్య సదస్సుకు ఆయనను ఆహ్వానించారు. ఈ సంద్భంగా వారి మధ్య సాగిన సంభాషణల్లో ఇండియా కూటమి ఏర్పాటు విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో ‘నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చునా?’ అన్న విక్రమసింఘే ప్రశ్నకు సరేనంటూ మమత తలూపారు. దీంతో ఆయన ‘ప్రతిపక్ష […]

Mamata Banerjee

దుబాయ్‌: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. విక్రమసింఘేను మమతాబెనర్జీ బుధవారం దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో కలిశారు. కోల్‌కతాలో జరిగే వాణిజ్య సదస్సుకు ఆయనను ఆహ్వానించారు.

ఈ సంద్భంగా వారి మధ్య సాగిన సంభాషణల్లో ఇండియా కూటమి ఏర్పాటు విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో ‘నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చునా?’ అన్న విక్రమసింఘే ప్రశ్నకు సరేనంటూ మమత తలూపారు.

దీంతో ఆయన ‘ప్రతిపక్ష కూటమికి మీరు నాయకత్వం వహించబోతున్నారా?’ అని అడిగారు. అనూహ్యమైన ప్రశ్న ఎదురవడంతో అవాక్కయిన మమత.. ‘ఓ మై గాడ్‌..’ అంటూ బదులిచ్చారు. ఆ వెంటనే అదంతా ప్రజలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

కాగా.. ఆమె సమాధానంతో సంతృప్తి చెందని విక్రమసింఘే.. నవ్వుతూ.. అక్కడే ఉన్న మరో వ్యక్తిని ‘ఈమె ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించబోతున్నారా?’ అని మళ్లీ ప్రశ్నించారు. అయితే.. ప్రతిపక్షం అధికారంలోకి కూడా రావొచ్చని మమత తెలిపారు. ఈ మేరకు ఒక వీడియో క్లిప్‌ను పీటీఐ వార్తా సంస్థ విడుదల చేసింది.

శ్రీలంక అధ్యక్షుడితో ముచ్చటించిన విషయాన్ని మమతాబెనర్జీ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. దుబాయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తనను విక్రమసింఘే చూశారని, మాట్లాడేందుకు పిలిచారని ఆమె తెలిపారు. ఆయన శుభాకాంక్షలకు పొంగిపోయానని, త్వరలో కోల్‌కతాలో జరిగే బెంగాల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించానని పేర్కొన్నారు. వీలు చూసుకుని శ్రీలంకలో పర్యటించాలని ఆయన కోరారని తెలిపారు.

Updated On 13 Sep 2023 2:08 PM GMT
somu

somu

Next Story