ఉన్నమాట: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ ఒక్క ఓటుతో అయినా మేము గెలుస్తామనే వాదనను వాట్సప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేస్తున్నది. ఉన్నపళంగా ఆ పార్టీ ఈ ప్రచారం ఎందుకు మొదలుపెట్టిందని చాలా మంది ఆరా తీస్తున్నారు. చర్చించుకుంటున్నారు. దీనికి కారణం కమలం పార్టీ నేతల వాదనలకు మునుగోడు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడం లేదని సమాచారం. దీనికి స్థూలంగా మూడు కారణాలు ఉన్నాయి. […]

ఉన్నమాట: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ ఒక్క ఓటుతో అయినా మేము గెలుస్తామనే వాదనను వాట్సప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేస్తున్నది. ఉన్నపళంగా ఆ పార్టీ ఈ ప్రచారం ఎందుకు మొదలుపెట్టిందని చాలా మంది ఆరా తీస్తున్నారు. చర్చించుకుంటున్నారు. దీనికి కారణం కమలం పార్టీ నేతల వాదనలకు మునుగోడు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడం లేదని సమాచారం.
దీనికి స్థూలంగా మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడిన తర్వాత అక్కడ ఆ పార్టీ ఖతం అవుతుందని అనుకున్నారు. అది జరగలేదు. అట్లనే రాజగోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి అన్నదమ్ములు అయినా రాజకీయంగా ఇద్దరి దారులు వేరు అని అన్నారు. కానీ రాజీనామా చేసి ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు ఇద్దరు వేరు కాదు ఒక్కటే అన్నది తేటతెల్లమైంది. దీంతో తమ్ముడి గెలుపు కోసం తెర వెనుక వెంకటరెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి.
అన్నదమ్ములు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే రాజగోపాల్ రెడ్డితో వెళ్లిన వాళ్లు, వెంకటరెడ్డితో ఉన్న వాళ్లు కాకుండా పార్టీని పట్టుకుని ఉన్న క్యాడర్ అక్కడ కాంగ్రెస్‌ను నిలబెట్డడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రతిఘటనను కోమటిరెడ్డి బ్రదర్స్ గానీ, కాషాయ పార్టీ నేతలు గాని ఊహించలేదు. ఫలితంగా ఎక్కడో తేడా కొడుతున్నదనే అంచనాకు వచ్చారు. అందుకే మాట మార్చి ఒక్క ఓటుతో అన్న నినాదాన్ని ఎత్తుకున్నారు.
రెండోది అధికార టీఆర్ఎస్ విపక్ష నేతల నియోజకవర్గాలపై వివక్ష చూపుతున్నదని ప్రచారం చేశారు. అంతేకాదు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం ఇస్తున్న నిధులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. దుబ్బాక, హుజురాబాద్ గెలిపిస్తే కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు? ఏం అభివృద్ధి చేశారు అని ప్రజలు నిలదీస్తున్నారు. దీనికి నిన్న రఘునందన్ రావు ఫస్ట్రేషన్ గురై హరీశ్ రావును ఉద్దేశించి కేంద్రం ఏమిచ్చింది అని అడుగుతున్నారు.
కేంద్రం ఎందుకు ఇస్తుందిరా హౌలే.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకు? చాతగాదు అని వైదొలిగితే రాష్ట్రపతి పాలనో, గవర్నర్ పాలనో పెట్టి కేంద్రం ఇస్తుందన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్నది కొండంత, కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నది గోరంత అన్న టీఆర్ఎస్ చేస్తున్న వాదన నిజమని జనాలకు అర్థమైంది. అందుకే మాట మార్చి ఒక్క ఓటుతో అయినా గెలుస్తామని ప్రచారం మొదలుపెట్టారు.
మూడోది.. ఎంపీగా, ఎమ్మెల్సీగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా మూడున్నరేళ్లు కాంగ్రెస్‌లో ఉండి బీజేపీ కోవర్టుగా పనిచేశారని ప్రజలు విశ్వస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఇన్నేళ్లు ఏం చేయలేని రాజగోపాల్ ఈ ఏడాది పదవీ కాలంలో ఏం చేస్తాడు? తన స్వార్థం కోసం తెచ్చిన ఉప ఎన్నిక అని, బీజేపీ తన బలాన్ని అంచనా వేసుకోవడానికి ఆయన చేత రాజీనామా చేయించిందనే టీఆర్ఎస్, కాంగ్రెస్ వాదన వాస్తవమే అని ప్రజలు అనుకుంటున్నారు.
అందుకే ఒక్క ఓటు తో అయినా రాజగోపాల్ విజయం సాధిస్తాడని.. ఎట్లాగూ ఆయనే గెలుస్తాడు కాబట్టి ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేని తట్టస్థంగా ఉండే వాళ్ల ఓట్లను తమవైపు తిప్పుకునే ఎత్తుగడ ఇది అని నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? రాజగోపాల్ దీనికి ఏం సాధిస్తాడు అని అంటే ముందు తలుగు కొనుక్కొన్ని తర్వాత బర్రెను కొనుక్కున్నట్టు ఉన్నదని సెటైర్లు వేస్తున్నారు. - ఆసరి రాజు
