విధాత‌: గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న వారిలో నేర‌చ‌రిత్ర క‌ల‌వారే ఎక్కువ ఉన్న‌ట్లు ప్ర‌జాస్వామ్య సంస్క‌ర‌ణ‌ల సంఘం తెలిపింది. డిసెంబ‌ర్ 1 నుంచి జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీల‌న్నీ పోటీ ప‌డి నేర చ‌రితుల్నిఅభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించాయి. గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను సైతం ఖాత‌రు చేయ‌కుండా అన్నిపార్టీలు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. సుప్రీం తీర్పు ప‌ట్టించుకోని పార్టీలు.. రాజ‌కీయ పార్టీలు నేర‌చ‌రితుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఎంపిక చేయ‌కూడ‌ద‌ని, ఒక వేళ ఎంపిక చేస్తే ఏ ప‌రిస్థితుల్లో ఎంపిక […]

విధాత‌: గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న వారిలో నేర‌చ‌రిత్ర క‌ల‌వారే ఎక్కువ ఉన్న‌ట్లు ప్ర‌జాస్వామ్య సంస్క‌ర‌ణ‌ల సంఘం తెలిపింది. డిసెంబ‌ర్ 1 నుంచి జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీల‌న్నీ పోటీ ప‌డి నేర చ‌రితుల్నిఅభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించాయి. గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను సైతం ఖాత‌రు చేయ‌కుండా అన్నిపార్టీలు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

సుప్రీం తీర్పు ప‌ట్టించుకోని పార్టీలు..

రాజ‌కీయ పార్టీలు నేర‌చ‌రితుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఎంపిక చేయ‌కూడ‌ద‌ని, ఒక వేళ ఎంపిక చేస్తే ఏ ప‌రిస్థితుల్లో ఎంపిక చేయాల్సి వ‌చ్చిందో వివ‌ర‌ణ ఇచ్చుకోవాల‌ని సుప్రీంకోర్టు 2020 ఫిబ్ర‌వ‌రి 13న రాజ‌కీయ పార్టీల‌కు సూచించింది. అయినా పార్టీలేవీ సుప్రీం తీర్పును గౌర‌వించిన దాఖ‌లాలు క‌నిపించ‌టం లేదు.

ఆప్‌లోనే నేర‌చ‌రితులు ఎక్కువ‌

ఇవ్వాళ‌.. పార్టీల‌కు ఎన్నిక‌ల్లో గెలుపే ముఖ్య‌మై పోయింది. గెల‌వ‌టానికి ఏ అడ్డ‌దారులైన తొక్క‌టానికి వెనుకాడ‌టం లేదన‌టానికి ఈ ఎన్నిక‌లే నిద‌ర్శ‌నం. అందుకే గుజ‌రాత్‌లో 2017 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వారిలో నేర‌చ‌రితులు 15శాతం ఉంటే, ఇప్పుడు అది 21శాతానికి పెరిగింది! మ‌రో దిగ్భ్రాంతి క‌ర‌మైన విష‌యం ఏమంటే.

నేటి రాజ‌కీయాల్లో విలువ‌ల‌కు ప్ర‌తినిధిగా చెప్పుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నేర‌చ‌రితుల్నిత‌మ అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించింది. ఇత‌ర పార్టీల‌తో పోలిస్తే ఆప్‌లోనే నేర‌చ‌రితులు ఎక్కువ‌గా ఉండ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Updated On 26 Nov 2022 2:46 AM GMT
krs

krs

Next Story