విధాత: కరోనా తరువాత చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం వచ్చింది. ఇలా వచ్చిన అవకాశంతో కొంత మంది రెండు మూడు ఉద్యోగాలు చేసే కొత్త తరహా పని విధానానికి అలవాటు పడ్డారు. ఒక సంస్థలో రెగ్యులర్ ఎంప్లాయిలా ఉంటూ.. మరో సంస్థకు పనిచేయడం చట్ట విరుద్ధం. కానీ ఇంటి నుంచి చేసే ఉద్యోగమే కదా, ఎవరు చూస్తారులే అని చాలా మంది ఈ తరహా మూన్ లైటింగ్ ఉద్యోగాలు చేస్తున్నారు. […]

విధాత: కరోనా తరువాత చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం వచ్చింది. ఇలా వచ్చిన అవకాశంతో కొంత మంది రెండు మూడు ఉద్యోగాలు చేసే కొత్త తరహా పని విధానానికి అలవాటు పడ్డారు.
ఒక సంస్థలో రెగ్యులర్ ఎంప్లాయిలా ఉంటూ.. మరో సంస్థకు పనిచేయడం చట్ట విరుద్ధం. కానీ ఇంటి నుంచి చేసే ఉద్యోగమే కదా, ఎవరు చూస్తారులే అని చాలా మంది ఈ తరహా మూన్ లైటింగ్ ఉద్యోగాలు చేస్తున్నారు.
అలా ఏక కాలంలో రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లుగా (మూన్‌లైటింగ్) గుర్తించిన 300 మంది సిబ్బందికి విప్రో ఉద్వాసన పలికింది. తమ కంపెనీ ఉద్యోగుల్లో 300 మంది ఏకకాలంలో తమ ప్రత్యర్థి కంపెనీల కోసమూ పని చేస్తున్నట్లుగా గత కొన్ని నెలల్లో గుర్తించడం జరిగిందని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ బుధవారం మీడియాకు వెల్లడించారు.
