Tuesday, January 31, 2023
More
  Homeతెలంగాణ‌KCRతోనే గిరిజనుల జీవితాల్లో వెలుగులు: MLA ర‌వీంద్ర‌కుమార్‌

  KCRతోనే గిరిజనుల జీవితాల్లో వెలుగులు: MLA ర‌వీంద్ర‌కుమార్‌

  • రూ.40ల‌క్ష‌ల నిధుల‌తో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

  విధాత: తమ తండాలను, గూడాలను గ్రామపంచాయతీలుగా చేసి తామే అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ దేనని దేవరకొండ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ఆయన చందంపేట మండలం బిల్డింగ్ తండా, మనవత్ తండాలలో రూ.40లక్షల నిధుల‌తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

  మన ఊరు -మన ప్రభుత్వం-మన పథకాలు” కార్యక్రమంలో భాగంగా చందంపేట మండలం బిల్డింగ్ తండాలో రూ.20లక్షలు, మనవత్ తండాలో రూ.20లక్షల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని అన్నారు.

  గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ ద్వార ఇంటింటికీ సురక్షితమైన తాగు నీరు అందిస్తున్నామ‌ని అన్నారు.

  దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు.

  కార్యక్రమంలో ఎంపీపీ నున్సవత్ పార్వతి చందు నాయక్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు దొందేటి మల్లా రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, నేరడుగొమ్ము జడ్పీటీసీ కేతవత్ బాలు, మాజీ ఎంపీపీ ఏర్పుల గోవింద్ యాదవ్, జడ్పీటీసీ సలహాదారుడు రమావత్ మోహన్ కృష్ణ, యసాని రాజవర్ధన్ రెడ్డి, స్థానిక సర్పంచులు రమావత్ సంతోషకిషన్, లోక్య నాయక్, కేతవత్ శంకర్, వీర రెడ్డి, గోసుల అనంతగిరి, రామకృష్ణ యాదవ్, కొండల్ రెడ్డి,శోభన్ నాయక్, దేవా, రమేష్ నాయక్, బోడ్డుపల్లి కృష్ణ, గోవర్ధన్త దితరులు పాల్గొన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular