Odisha | Crime News | భువనేశ్వర్ : ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా, అతని మరణాన్ని తట్టుకోలేక భార్య, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ విషాద ఘటన ఒడిశాలోని బర్‌గర్హ్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బర్‌గర్హ్ జిల్లాకు చెందిన అర్హున్ సాహుకు భార్య కుముదిని, కుమారు బన్సీధర్ సాహు, కూతురు సుబర్ణ మహాజన్ ఉన్నారు. అయితే సెప్టెంబర్ 6వ తేదీన అర్జున్ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. అర్జున్ మరణంతో భార్యాపిల్లలు […]

Odisha | Crime News |
భువనేశ్వర్ : ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా, అతని మరణాన్ని తట్టుకోలేక భార్య, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ విషాద ఘటన ఒడిశాలోని బర్‌గర్హ్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బర్‌గర్హ్ జిల్లాకు చెందిన అర్హున్ సాహుకు భార్య కుముదిని, కుమారు బన్సీధర్ సాహు, కూతురు సుబర్ణ మహాజన్ ఉన్నారు. అయితే సెప్టెంబర్ 6వ తేదీన అర్జున్ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. అర్జున్ మరణంతో భార్యాపిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. అతని మరణాన్ని తట్టుకోలేక ఆదివారం నాడు కుముదిని, ఇద్దరు పిల్లలు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
స్థానికులు కుముదిని కుటుంబాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ప్రాణపాయ స్థితిలో ఉన్న ముగ్గురిని సోహెలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
బన్సీధర్ సోహెలాలో చనిపోగా, అతని సోదరి సుబర్ణను బుర్లా మెడికల్ కాలేజీకి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. కుముదిని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
