Pregnant Woman | గర్భం దాల్చిన మహిళ.. తన బిడ్డను నవమాసాలు మోయాలి. కొంత మంది గర్భిణిలు మాత్రం కొన్ని సందర్భాల్లో ఏడు నెలలకే డెలివరీ అవుతుంటారు. కానీ ఈ మహిళ మాత్రం ప్రెగ్నెన్సీ అని తెలిసిన 48 గంటలకే డెలివరీ అయింది. మీరు చదువుతున్నది నిజమే. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఆ వివరాలు తెలుసుకోవాలంటే అమెరికాకు వెళ్లాల్సిందే. అమెరికాకు చెందిన పెయిటన్ స్టోవర్(23) తన భర్తతో కలిసి ఓమహాలో నివాసం ఉంటోంది. స్టోవర్ టీచర్ […]

Pregnant Woman | గర్భం దాల్చిన మహిళ.. తన బిడ్డను నవమాసాలు మోయాలి. కొంత మంది గర్భిణిలు మాత్రం కొన్ని సందర్భాల్లో ఏడు నెలలకే డెలివరీ అవుతుంటారు. కానీ ఈ మహిళ మాత్రం ప్రెగ్నెన్సీ అని తెలిసిన 48 గంటలకే డెలివరీ అయింది. మీరు చదువుతున్నది నిజమే. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఆ వివరాలు తెలుసుకోవాలంటే అమెరికాకు వెళ్లాల్సిందే.


అమెరికాకు చెందిన పెయిటన్ స్టోవర్(23) తన భర్తతో కలిసి ఓమహాలో నివాసం ఉంటోంది. స్టోవర్ టీచర్ జాబ్ చేస్తోంది. అయితే ఆమెకు కొద్ది రోజుల నుంచి తీవ్రమైన తలనొప్పి ఉంది. ఒత్తిడి కారణంగానే తల నొప్పి వచ్చిందని భావించింది. కానీ ఆ నొప్పి మరింత తీవ్రమైంది. ఆమె శరీరంలో మార్పులు వచ్చాయి. కాళ్లు వాచిపోయాయి. వాంతులు ప్రారంభమయ్యాయి. దీంతో చేసేదేమీ లేక డాక్టర్‌ను సంప్రదించింది.

టెస్టులు చేయగా ప్రెగ్నెన్సీ అని తేలగా స్టోవర్ దంపతులు నమ్మలేదు. మళ్లీ టెస్టులు చేయించుకున్నారు. మళ్లీ అదే రిజల్డ్. అల్ట్రా సౌండ్ స్కానింగ్ కూడా తీయించారు. ఆరు నెలల గర్భిణి అని కూడా రిపోర్టులో తేలింది. స్టోవర్ దంపతులు షాక్ అయ్యారు.

ఇక డాక్టర్లు వారికి మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. స్టోవర్ ప్రీక్లాంప్సీయా అనే రుగ్మతతో బాధ పడుతున్నట్లు తేల్చారు. ఆ రుగ్మత కారణంగానే కడుపులో పెరుగుతున్న బిడ్డ కదలికలు తెలియలేదని చెప్పారు. దీని వల్ల బీపీ అధికమై మూత్రపిండాలు, కాలేయం పనితీరు మందగిస్తుందని స్పష్టం చేశారు. ఇది తల్లీబిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు చెప్పేశారు.

డాక్టర్ల సూచన మేరకు స్టోవర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ అని తెలిసినా 48 గంటలకే సీజేరియన్ నిర్వహించారు. స్టోవర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో స్టోవర్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.

10 వారాలు ముందుగానే జన్మించిన ఆ శిశువు బరువు ఒక కిలో 800 గ్రాముల బరువు ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కాగా, ఆరు నెలల గర్భిణి అయినా స్టోవర్‌ పొట్ట లావుగా బయటికి కనిపించక పోవడానికి ప్రీక్లామ్‌ప్సియా కారణం అయివుండవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఇలాంటివి అత్యంత అరుదుగా సంభవిస్తాయని తెలిపారు.

Updated On 18 Oct 2022 5:22 PM GMT
subbareddy

subbareddy

Next Story