Hyderabad | విధాత, నాలాలో పడి లక్ష్మి అనే మహిళ గల్లంతైన ఘటన హైద్రాబాద్ గాంధీనగర్ లో చోటుచేసుకుంది. హుస్సెన్ సాగర్ నాలాపై ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న లక్ష్మి నిన్న మధ్యాహ్నం నుంచి కనబడకుండా పోయింది. దగ్గరలోని సీసీ కెమెరా ఫుటేజీలో ఆమె ఇంట్లోకి వెలుతూ కనిపించింది. ఇటీవల వర్షాలకు ఇంటిగోడ కూలింది. లక్ష్మి నాలాలో పడిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. కాగా.. తల్లి కనిపించడం లేదని ఆమె కూతురు సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె […]

Hyderabad | విధాత, నాలాలో పడి లక్ష్మి అనే మహిళ గల్లంతైన ఘటన హైద్రాబాద్ గాంధీనగర్ లో చోటుచేసుకుంది. హుస్సెన్ సాగర్ నాలాపై ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న లక్ష్మి నిన్న మధ్యాహ్నం నుంచి కనబడకుండా పోయింది. దగ్గరలోని సీసీ కెమెరా ఫుటేజీలో ఆమె ఇంట్లోకి వెలుతూ కనిపించింది. ఇటీవల వర్షాలకు ఇంటిగోడ కూలింది. లక్ష్మి నాలాలో పడిపోయినట్లుగా అనుమానిస్తున్నారు.
కాగా.. తల్లి కనిపించడం లేదని ఆమె కూతురు సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సైతం ఆమె కోసం నాలాలో గాలిస్తున్నారు. లక్ష్మీ వంట గది దగ్గర పగిలిన గాజులు కనిపించడం, ఆమె మొబైల్ ఫోన్ కూడా ఇంట్లోనే ఉండటంతో పోలీసులు ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
