Love | ఓ ఇద్దరమ్మాయిలు ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతున్నారు. ఈ విషయం ఓ అమ్మాయి( Woman ) తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమెకు పెళ్లి( Marriage ) చేశారు. కానీ నెల రోజులకే భర్త( Husband )ను వదిలేసి తన ప్రేయసి( Lover )తో వెళ్లిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్( West Bengal )లోని ఆలిపుర్‌ద్వార్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆలిపుర్‌ద్వారా జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి, కూచ్‌బిహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్ వాసి అయిన మరో అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకున్నారు. రెండేండ్ల క్రితం ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతుండగా.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఇద్దరమ్మాయిల ఇండ్లలో తెలిసింది. దీంతో తుఫాన్‌గంజ్‌కు చెందిన అమ్మాయికి ఓ యువకుడితో నెల రోజుల క్రితం తల్లిదండ్రులు వివాహం జరిపించారు.
కానీ మనసులో మాత్రం ఆమెనే..
పెళ్లైనప్పటికీ ఆమెకు మాత్రం తన ప్రేయసి మీదనే ధ్యాస ఉంది. దీంతో నెల రోజులకే భర్తను వదిలేసి.. తన ప్రియురాలి వద్దకు వెళ్లిపోయింది. ఇద్దరూ కలిసి మల్దా ప్రాంతంలోని ఓ హోటల్‌లో దిగారు. వారి ప్రవర్తనపై సిబ్బందికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన విషయం చెప్పారు. తాము మేజర్లమని, తల్లిదండ్రులు తమ సంబంధాన్ని అంగీకరిస్తేనే తిరిగి ఇంటికి వెళ్తామని స్పష్టం చేశారు. లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వారు తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆ ఇద్దరమ్మాయిలు మాల్దా పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. తల్లిదండ్రుల రాక కోసం ఎదురుచూస్తున్నారు.