DOG | డెహ్రాడూన్: మనుషుల్లో కొందరు వింత జంతువులు కూడా ఉంటారంటే తప్పుకాదేమో. లేదంటే.. కుక్కకు బీరు తాగించే వారు ఉంటారా? ఉన్నారు! సోషల్ మీడియాలో హల్ చల్ చేయడానికి, వైరల్ కావడానికి పిచ్చిపిచ్చి చేష్టలకు పాల్పడేరకం వారు చాలామందే ఉన్నారు. అలాంటి కథే ఇదీనూ. డెహ్రాడూన్‌లో ఒక యువతి కుక్కను సాదుకుంటున్నది. అదంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ. పర్వాలేదు.. ఇప్పుడామె సోషల్ మీడియాలో ప్రపంచమంతా బాగా ప్రచారం అయి పోయింది. ఆమె చేసిన నిర్వాకం ఏందంటే.. […]

DOG |
డెహ్రాడూన్: మనుషుల్లో కొందరు వింత జంతువులు కూడా ఉంటారంటే తప్పుకాదేమో. లేదంటే.. కుక్కకు బీరు తాగించే వారు ఉంటారా? ఉన్నారు! సోషల్ మీడియాలో హల్ చల్ చేయడానికి, వైరల్ కావడానికి పిచ్చిపిచ్చి చేష్టలకు పాల్పడేరకం వారు చాలామందే ఉన్నారు. అలాంటి కథే ఇదీనూ.
డెహ్రాడూన్‌లో ఒక యువతి కుక్కను సాదుకుంటున్నది. అదంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ. పర్వాలేదు.. ఇప్పుడామె సోషల్ మీడియాలో ప్రపంచమంతా బాగా ప్రచారం అయి పోయింది. ఆమె చేసిన నిర్వాకం ఏందంటే.. తన ప్రేమను ఒలకబోస్తూ కుక్కకు బీరు తాగిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పెట్టింది.
కొందరు ఇది వింతగా వుందంటే, మరికొందరు ఇది వింత కాదు పాడు కాదు, పిచ్చితనం అని మండి పోతున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఆ యువతి కుక్కకు బీరు తాగిస్తూ కనిపిస్తుంది. కుక్క మాత్రం ఏంతో నిజాయితీగా బీరు తాగటం నావల్ల కాదంటూ ఇబ్బంది పడుతూ మొరాయిస్తుంటుంది.
Force feeding Beer to pet Dog! Anything to get some cheap social media fame. Heights of deranged behaviour!!
IG: khush_arden@DehradunPolice pic.twitter.com/wwhuvYIrVM
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) September 7, 2023
కుక్క భాషను అర్థం చేసుకోలేని యువతి మాత్రం బలవంతంగా బీరు తాగించేందుకే ప్రయత్నిస్తుంది. కుక్క సహాయం కోసం అటూఇటూ పేలవంగా చూస్తుంటుంది. నెట్‌లో ఈ వీడియోను చూసిన జనం జంతువుల పట్ల మనిషి రాక్షసత్వానికి ఇది నిదర్శనం అంటూ మండిపడ్డారు.
దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్త జంతువుల పట్ల మానవుని అమానవీయ ప్రవర్తనకు ఇది నిదర్శనమన్నారు. నేటి యువత అడ్డదిడ్డంగా చౌకబారు కొంటెతనంతో సోషల్ మీడియా ద్వారా ప్రపంచమంతా వున్న పళంగా రాత్రికి రాత్రే ఫేమ్ గావాలని ఇటువంటి కుచేష్టలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు.
ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. జంతువుల పట్ల అమానవీయ వ్యవహారం కింద కేసు నమోదు చేసి చర్యలు చేపట్టడానికి పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఫేమ్ కావడం ఏమోగానీ.. ఇప్పుడు ఆమె పిచ్చి చేష్ట.. కేసులదాకా తీసుకుపోయింది.
