విధాత: పుట్టిన రోజు నాడు పిల్లలను నిద్రలేపి వారి చేతిలో గిఫ్ట్ పెట్టి గ్రీటింగ్స్ చెప్పడం మామూలే. కానీ.. ఒక తల్లికి తన బిడ్డ శుభాకాంక్షలు చెప్పిన తీరు.. దానికి ఆమె స్పందన సామాజిక మాధ్యమాల్లో (Viral Video) లక్షల హృదయాలను తాకుతున్నది. దీన్ని ఆమె భర్త ప్లాన్ చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నది.
ఒక మహిళ నిద్రపోతూ ఉంటుంది. ఆరోజు ఆమె బర్త్‌డే. ఆ రోజును స్పెషల్‌గా స్టార్ట్ చేయాలని భావించిన భర్త.. తమ ముద్దులొలికే పాపాయితో గ్రీటింగ్స్ చెప్పించాడు. ఇద్దరూ ఆమె నిద్రపోతున్న గదిలోకి వచ్చి.. ‘హ్యాపీ బర్త్‌డే టూ యూ’ అంటూ పాడటం మొదలు పెడతారు.
View this post on Instagram
మెలకువ వచ్చిన తల్లి తన బిడ్డను అబ్బురంగా చూస్తూ ఉంటుంది. ఆ పాప పాటను కొనసాగిస్తూ తన తల్లికి రెండు గ్రీటింగ్ కార్డులు, కప్ కేకులు అందిస్తుంది. వాటిని తీసుకున్న ఆ తల్లి.. తన బిడ్డను రెండు చేతులతో ఎత్తుకుని.. హృదయానికి హత్తుకుని ముద్దులతో ముంచెత్తుతుంది. దీనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.