Delhi | విధాత: ఓ యువ‌తి దారుణ చ‌ర్య‌కు పాల్ప‌డేందుకు య‌త్నించింది. చ‌నిపోయిన త‌న తండ్రి తిరిగి రావాలంటే ఏం చేయాల‌ని కొంత మంది మంత్ర‌గాళ్ల‌ను సంప్ర‌దించింది. రెండు నెల‌ల ప‌సికందును న‌ర‌బ‌లి ఇవ్వాల‌ని చెప్ప‌డంతో.. ఆమె ఓ ఆస్ప‌త్రికి వెళ్లింది. అక్క‌డ ప‌సికందును కిడ్నాప్ చేసి.. న‌ర‌బ‌లి ఇచ్చేందుకు సిద్ధ‌మవగా విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్ర‌య‌త్నాన్ని అడ్డుకున్నారు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్ ఆస్ప‌త్రిలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో నివాస‌ముండే శ్వేత‌(24) […]

Delhi | విధాత: ఓ యువ‌తి దారుణ చ‌ర్య‌కు పాల్ప‌డేందుకు య‌త్నించింది. చ‌నిపోయిన త‌న తండ్రి తిరిగి రావాలంటే ఏం చేయాల‌ని కొంత మంది మంత్ర‌గాళ్ల‌ను సంప్ర‌దించింది. రెండు నెల‌ల ప‌సికందును న‌ర‌బ‌లి ఇవ్వాల‌ని చెప్ప‌డంతో.. ఆమె ఓ ఆస్ప‌త్రికి వెళ్లింది. అక్క‌డ ప‌సికందును కిడ్నాప్ చేసి.. న‌ర‌బ‌లి ఇచ్చేందుకు సిద్ధ‌మవగా విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్ర‌య‌త్నాన్ని అడ్డుకున్నారు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్ ఆస్ప‌త్రిలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో నివాస‌ముండే శ్వేత‌(24) తండ్రి కొద్ది రోజుల క్రితం మ‌ర‌ణించాడు. అయితే తండ్రి లేని జీవితాన్ని ఆమె ఊహించుకోలేక‌ పోయింది. త‌న తండ్రి తిరిగి రావాలంటే ఏం చేయాలో ఆలోచించింది. ఈ క్ర‌మంలో క్షుద్ర పూజ‌లు చేసే వారిని శ్వేత సంప్ర‌దించింది. రెండు నెల‌ల ప‌సి బాలుడిని న‌ర‌బ‌లి ఇస్తే మీ తండ్రి తిరిగి వ‌స్తాడ‌ని వారు శ్వేత‌కు సూచించారు. మూఢ‌న‌మ్మ‌కంతో ఆమె కూడా మంత్ర‌గాళ్లు చెప్పిన‌ట్లు చేసేందుకు య‌త్నించింది.

ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్ ఆస్ప‌త్రికి వెళ్లి.. ఓ బాలింత వ‌ద్ద త‌న‌కు తాను ఎన్జీవో అని ప‌రిచ‌యం చేసుకుంది. శిశువు అభివృద్ధిని ప‌రిశీలించాల‌ని చెప్పి అక్క‌డ్నుంచి తీసుకెళ్లింది. ఎంతకు తిరిగి రాక‌పోవ‌డంతో త‌న బిడ్డ‌ను కిడ్నాప్ చేశార‌ని గ్ర‌హించి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీ స‌హాయంతో మ‌హిళ‌ను గుర్తించి, శిశువును స్వాధీనం చేసుకున్నారు. శిశువును గుండెల‌కు హ‌త్తుకుని త‌ల్లి భావోద్వేగానికి లోనైంది. శ్వేత‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated On 14 Nov 2022 5:29 AM GMT
subbareddy

subbareddy

Next Story