Viral Video | ఓ 3 ఏండ్ల పాప తన తల్లితో కలిసి రైల్వేస్టేషన్లో నిల్చుని రైలు కోసం ఎదురు చూస్తూ ఉంది. అంతలోనే అక్కడే ఉన్న ఓ మహిళ వెనుకాల నుంచి పాపను పట్టాలపైకి తోసేసింది. వేంటనే ప్రయాణికులు అప్రమత్తమై ఆ పాపను ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువచ్చారు.
ఆ సమయంలో రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిన్నారి ముఖానికి తీవ్ర గాయాలవగా ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఈ ఘటన డిసెంబర్ 28వ తేదీన అమెరికాలోని ఓరేగాన్ స్టేషన్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
చిన్నారిని పట్టాలపైకి తోసేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. అయితే పాపను పట్టాలపైకి ఎందుకు తోయాల్సి వచ్చిందనే విషయంపై స్పష్టత లేదు. నిందితురాలిని బ్రియానా లేస్ వర్క్మాన్గా గుర్తించారు. ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం లేదని పోలీసులు పేర్కొన్నారు.
వామ్మో.. కోపంతో చిన్నారిని రైల్వేట్రాక్ పై పడేసిన మహిళ | Jordar News | hmtv#railwaystation #jordarnews #hmtv pic.twitter.com/3nuLRpQ72W
— hmtv News (@hmtvnewslive) January 4, 2023