Wednesday, December 7, 2022
More
    Homelatestమద్యం మత్తులో నడిరోడ్డుపై మహిళల హంగామా.. మరో యువతిపై దాడి (వీడియో) వైరల్

    మద్యం మత్తులో నడిరోడ్డుపై మహిళల హంగామా.. మరో యువతిపై దాడి (వీడియో) వైరల్

    Viral Video | మద్యం మత్తులో మగాళ్లు చిందులు వేయడం, దాడులు చేయడం చూశాం. కానీ ఓ నలుగురు మహిళలు మాత్రం మద్యం మత్తులో నడిరోడ్డుపై హంగామా సృష్టించారు. ఓ యువతిపై పంచుల వర్షం కురిపించారు. కాపాడండి అంటూ వేడుకున్నప్పటికీ, ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగు చూసింది.

    వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీలో ఓ నలుగురు యువతులు హల్ చల్ చేశారు. పబ్ లో పీకల దాకా మద్యం సేవించి, బయటకు వచ్చి హంగామా సృష్టించారు. నలుగురు కలిసి మరో యువతిపై దాడికి దిగారు. పంచుల వర్షం కురిపించారు. కాళ్లతో తన్నారు. బెల్టులతో చితకబాదారు. కర్రలతో కొట్టారు.

    ఆ దెబ్బలు భరించలేక కాపాడంటూ బాధితురాలు వేడుకున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా కనికరించలేదు. రహదారిపై చాలా మంది నిల్చుని చూశారే తప్ప.. బాధితురాలిని చేర దీయలేదు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియో పోలీసుల దాకా చేరింది. ముగ్గురు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ యువతిపై ఎందుకు దాడి చేశారనే విషయం తెలియ రాలేదని పోలీసులు పేర్కొన్నారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page