Saturday, April 1, 2023
More
    Homeతెలంగాణ‌NALGONDA: మహిళా ప్రగతితోనే దేశాభివృద్ధి సంపూర్ణం: మాజీ MLA వేముల

    NALGONDA: మహిళా ప్రగతితోనే దేశాభివృద్ధి సంపూర్ణం: మాజీ MLA వేముల

    International Women’s Day Celebration: EX MLA Vemula

    విధాత: మహిళా ప్రగతితోనే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం(EX MLA Vemula Veeresham) అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day Celebration:) సందర్భంగా ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్ల‌కు, ఆశా వర్కర్లకు, ఆయాలకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి, ప్రైవేటు పాఠశాలల టీచర్లకు, మున్సిపల్ కార్మికులకు, మహిళా సంఘం నాయకురాలకు సుమారుగా 5 వేల మందికి చీరలు పంపిణీ చేసి గౌరవించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు.

    విభిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న అపూర్వ విజయాలు నారీశక్తిని చాటుతున్నారని కొనియాడారు. మహిళాశక్తిని చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. మహిళా సాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు, వారి గౌరవాన్ని పెంచుతూ, స్త్రీ జనోద్ధరణే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

    మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతున్నదని అన్నారు. ఆడపిల్లలు తల్లి క డుపులో ఎదుగుతున్న దశ నుంచి జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని వెల్లడించారు. మహిళల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య , స్థానిక కౌన్సిలర్లు, మహిళా సంఘం నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular