Phone | ప్రపంచంలో ఖరీదైన ఫోన్ ఎవరి దగ్గర ఉంది అని అడిగితే మీరేం చెబుతారు? అమెరికా అధ్యక్షుడా, ఎలాన మస్క్.. ఇలా ఆ జాబితా వెళిపోతుంది కదా.. అసలు ఆ ఫోన్ ఖరీదు ఎంత అంటే? ఇదే ప్రశ్నను ఒక యూట్యూబర్ రోడ్డుపై వెళుతున్న వారిని సరదాగా అడిగారు. వారు ముందు రూ.50 లక్షలని, తర్వాత రూ.కోటి అని కొంచెం పెంచి రూ.25 కోట్లు అని చెప్పారు. ఒక యువకుడు కాస్త ముందుకెళ్లి రూ.50 కోట్లు […]

Phone |
ప్రపంచంలో ఖరీదైన ఫోన్ ఎవరి దగ్గర ఉంది అని అడిగితే మీరేం చెబుతారు? అమెరికా అధ్యక్షుడా, ఎలాన మస్క్.. ఇలా ఆ జాబితా వెళిపోతుంది కదా.. అసలు ఆ ఫోన్ ఖరీదు ఎంత అంటే? ఇదే ప్రశ్నను ఒక యూట్యూబర్ రోడ్డుపై వెళుతున్న వారిని సరదాగా అడిగారు.
వారు ముందు రూ.50 లక్షలని, తర్వాత రూ.కోటి అని కొంచెం పెంచి రూ.25 కోట్లు అని చెప్పారు. ఒక యువకుడు కాస్త ముందుకెళ్లి రూ.50 కోట్లు అని తెలిపారు. చివరిగా ఆ యూట్యూబర్ సమాధానం ఇచ్చేశాడు.
ప్రపంచంలోనే అతి ఖరీదైన ఫోన్ నీతా అంబానీ దగ్గర ఉంది. బంగారు పూత పోసిన ఆపిల్ ఐఫోన్ 6కు అరుదైన ఫాల్కన్ గులాబీ రంగు వజ్రం పొదిగి ఉన్న ఫోన్‌ను ఆమె ఉపయోగిస్తారని, దీని ధర అక్షరాలా రూ.360 కోట్లని ఆ యూట్యూబర్ చెప్పాడు. దీంతో అప్పటి వరకు జవాబులు చెప్పిన వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. అయితే ఇది పూర్తిగా నిరాధారమని చాలామంది కొట్టి పారేశారు.
