HomelatestWTC Final | ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌కు పెద్ద సవాలే :...

WTC Final | ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌కు పెద్ద సవాలే : రాహుల్‌ ద్రావిడ్‌

WTC Final | ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్‌జట్టు అర్హత సాధించింది. జూన్‌ 7 నుంచి 11 వరకు ఓవల్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనున్నది. ఈ సందర్భంగా టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ స్పందిస్తూ.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌కు పెద్ద సవాలేనని అభిప్రాయపడ్డాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023 సీజన్‌ ముగిసిన వారం తర్వాత వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగనున్నది. మన ఆటగాళ్లు సమర్థులని, ఒత్తిడిలో ఉన్నప్పుడు మెరుగైన ప్రదర్శన చేస్తారని పేర్కొన్నాడు. తొలి టెస్టులో రోహిత్‌ సెంచరీ సాధించాడని, అహ్మదాబాద్‌లో విరాట్‌ కోహ్లీ భారీ ఇన్సింగ్‌ ఆడాడని గుర్తు చేశారు. అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌, శుభమాన్‌ గిల్‌ అందరూ తమ పాత్రలను అద్భుతంగా పోషించాడన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ చాలెంజింగ్‌ అని, ఆసిస్‌ తమను మమ్మల్ని చాలాసార్లు ఒత్తిడికి గురి చేసిందని చెప్పాడు.

రికార్డు సృష్టించిన టీమిండియా..

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంతో సరికొత్త రికార్డును సృష్టించింది. టీమిండియా సొంత గడ్డపై వరుసగా 16వ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్నది. భారత్ స్వదేశంలో 2013 నుంచి వరుసగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్‌పై సిరీస్‌లను గెలిచింది. 2016 నుంచి 2023 వరకు వరుసగా నాలుగు సార్లు ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్‌లు గెలిచింది. భారత్ 30 ఏళ్లలో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. 2000 నుంచి స్వదేశంలో 39 టెస్టులు ఆడిన టీమిండియా 31 సిరీసుల్లో గెలుపొందింది. అత్యధికంగా స్వదేశంలో టెస్టు సిరీస్‌లు గిలిచిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆసీస్ ఆడిన 41 సిరీసుల్లో 32 విజయం సాధించింది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular