HomelatestYadadri Bhuvanagiri | ప్రియాంక కోసం.. పోచంపల్లి పట్టు చీరలు ఖరీదు చేసిన భట్టి

Yadadri Bhuvanagiri | ప్రియాంక కోసం.. పోచంపల్లి పట్టు చీరలు ఖరీదు చేసిన భట్టి

Yadadri Bhuvanagiri

  • చేనేత కార్మికుల స‌మ‌స్య‌లు తెలుసుకున్న సీఎల్పీనేత భ‌ట్టి విక్ర‌మార్క‌

విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 51వ రోజు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికులతో సమావేశమై
వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

చేనేత కార్మికుడు వేముల శ్యామ్ ఇంటికి వెళ్లి చీరలను నేయడం కోసం చేనేత కార్మికులు పడుతున్న శ్రమ, చేనేత మగ్గాలు, చీరలు నేసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఒక చీర తయారు కావడానికి ఎంత మంది పని చేస్తారని ఎన్ని రోజులు పడుతుందని వారిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు ప్రోత్సాహకాల గురించి ఆరా తీశారు. ఆ తర్వాత శ్యామ్ ఇంట్లో మూడు చీరలను ప్రియాంక గాంధీకి బహుకరణ చేయడానికి ఖరీదు చేశారు.

ఈనెల 8న సరూర్ నగర్ లో నిర్వహించనున్న నిరుద్యోగ డిక్లరేషన్ సభకు హాజరుకానున్న ప్రియాంక గాంధీకి పోచంపల్లి చేనేత చీరలను బహుకరించనున్నట్లు భట్టి తెలిపారు. ఆ తర్వాత నేత కార్మికుడు సూరపల్లి రాము పాదయాత్రకు ఎదురుగా వచ్చి తాను నేస్తున్న ఇక్కత్ చీరలను చూడాలని భట్టి విక్రమార్కను ఆయన ఇంట్లోకి తీసుకువెళ్లి చూపించారు.

చీరలు తయారు చేయడానికి నూలుకు ఇచ్చే సబ్సిడీ, రాయితీలు రావడంలేదని, కేంద్ర ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధిస్తే, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం పన్నులు వేస్తున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పన్నులు వేయకుండా ప్రత్యేక రాయితీలు ఇచ్చారని గుర్తు చేశారు.

ఇందిరమ్మ రాజ్యం వస్తేనే తిరిగి మా బతుకులు బాగుపడతాయని, ఇందుకు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించుకుంటామన్నారు. ఆ తర్వాత కొబ్బరి బోండాలు అమ్ముతున్న భారతమ్మతో భట్టి మాట్లాడారు. ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందా అని అడిగారు.

తనకు ఇల్లు రాలేదని ఇంట్లో చదువుకున్న కొడుకుకి కొలువు కూడా రాకపోవడంతో రోడ్డుమీద తిరుగుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొబ్బరి బోండాలు అమ్ముకున్న డబ్బులతో కుటుంబాన్ని సాకుతున్నానని, తమకు ఏమైనా సాయం చేయించాలని వేడుకున్నది.

ఆ తర్వాత ఎంపీడీవో కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పోచంపల్లి నుంచి బాటసింగారం వరకు కొనసాగిన పాదయాత్రకు జనం నీరాజనం పలికారు. దారి పొడవునా సమస్యలు ఆలకిస్తూ పాదయాత్ర కొనసాగించారు.

జలాల్పురం గ్రామం సర్వేనెంబర్ 80లో 90 ఎకరాల భూమిని వంద సంవత్సరాల నుంచి సేద్యం చేసుకుంటున్నా వారికి పట్టాలు ఇవ్వకుండా ఇంగ్లీష్ మరియు ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ కి అలకేషన్ చేశారని గ్రామస్తులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు గోడు వెల్లబోసుకున్నారు.

రెవెన్యూ రికార్డులో అటవీ భూమిగా నమోదై ఉందని చెప్పి పట్టాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెట్టగా నల్లగొండ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆ తర్వాత కొలతలు చేయించి పోరంబోకు భూమిగా సేత్వాల్లో ఉన్నదని రికార్డు ఇచ్చారు.

రెవెన్యూ భూమిగా పరిగణించిన ప్రభుత్వం 100 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న రైతులకు కాకుండా ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీకి కేటాయించి తమకు అన్యాయం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో బాధిత రైతులు ఉపేందర్ గౌడ్, పాలకూల రాజు, హరి ప్రసాద్ గౌడ్, కొయ్యడ లోకేష్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, ఈశ్వరయ్య, నరసింహ తదితరులు ఉన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular