Yadagirigutta Brahmotsavam is over విధాత: యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు వైభవంగా కొనసాగి శుక్రవారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఉదయం స్వామివారి గర్భాలయంలో మూలవరులకు నిత్యారాధనలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం అర్చకులు, యజ్ఞికులు, పారాయణికుల బృందం అష్టోత్తర శతకటాభిషేకం నిర్వహించారు. 108 కల‌శాల పూజలతో పాంచరాత్రాగమ శాస్త్రానుసారం అష్టోత్తర శతఘటాభిషేకంలో భాగంగా కల‌శాలలోని మంత్రజలంతో స్వామి వారికి అభిషేకం చేశారు. రాత్రి స్వామి, అమ్మవార్ల […]

Yadagirigutta Brahmotsavam is over

విధాత: యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు వైభవంగా కొనసాగి శుక్రవారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో ఘనంగా ముగిశాయి.

ఉదయం స్వామివారి గర్భాలయంలో మూలవరులకు నిత్యారాధనలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం అర్చకులు, యజ్ఞికులు, పారాయణికుల బృందం అష్టోత్తర శతకటాభిషేకం నిర్వహించారు. 108 కల‌శాల పూజలతో పాంచరాత్రాగమ శాస్త్రానుసారం అష్టోత్తర శతఘటాభిషేకంలో భాగంగా కల‌శాలలోని మంత్రజలంతో స్వామి వారికి అభిషేకం చేశారు.

రాత్రి స్వామి, అమ్మవార్ల శృంగార డోలోత్సవం, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాల ముగింపు పర్వాలను పూర్తి చేశారు. అనంతరం దేవస్థానం తరపున అర్చక, యజ్ఞిక, పారాయణికులను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహ చార్యులు, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ఈవో గీత, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు మాజీ మంత్రి కడియం శ్రీహరి, ప్రధాన ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఏకాదశి సందర్భంగా ప్రధాన ఆలయంలో కొలువైన ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం వైభ‌వంగా నిర్వహించారు.

Updated On 3 March 2023 3:55 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story