Yadagirigutta
విధాత: రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమితులైన మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ దంపతులు బుధవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సోమేష్ కుమార్‌కు ఆలయ ఈవో గీత అధికారిక స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి లడ్డుప్రసాదాలు అందజేశారు. అర్చక బృందం వారికి ఆశీర్వచనాలు పలికారు.