ఉన్న‌మాట: రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్సీపీ క్యాడర్ల మధ్య అగ్గి రాజేసిన హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో అందరికన్నా ఎక్కువగా స్పందించిన అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రెండ్రోజుల్లోనే నాలుక మడతేశారు. జగను ను పొగడ్తలతో ముంచెత్తారు. వాస్తవానికి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు ఉండగా దాన్ని తీసేసి వైఎస్సార్ హెల్త్ యోనివర్సిటీగామార్చడాన్ని టిడిపి వ్యతిరేకించింది. టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నాలు చేశారు. అయితే వైఎస్సార్సీపీ కూడా గట్టిగానే ఎదురు దాడి చేసింది. చివరకు […]

ఉన్న‌మాట: రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్సీపీ క్యాడర్ల మధ్య అగ్గి రాజేసిన హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో అందరికన్నా ఎక్కువగా స్పందించిన అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రెండ్రోజుల్లోనే నాలుక మడతేశారు. జగను ను పొగడ్తలతో ముంచెత్తారు.

వాస్తవానికి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు ఉండగా దాన్ని తీసేసి వైఎస్సార్ హెల్త్ యోనివర్సిటీగా
మార్చడాన్ని టిడిపి వ్యతిరేకించింది. టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నాలు చేశారు. అయితే వైఎస్సార్సీపీ కూడా గట్టిగానే ఎదురు దాడి చేసింది.

చివరకు ఎన్టీఆర్ భార్య, తెలుగు ఏకాడమి చైర్మన్ లక్ష్మీ పార్వతి సైతం ఈ పేరు మార్పు మీద సైలెంట్ గానే ఉన్నారు కానీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాత్రం కాస్త ఎక్కువగా స్పందించి నిరసనగా తన పదవులకు రాజీనామా చేశారు.

దీంతో పాటు మరో రెండు పదవులైన హిందీ అకాడమీ చైర్మన్ పదవికి తెలుగు భాషా ప్రాధికార సంస్థ చైర్మన్ పదవులకు సైతం యార్లగడ్డ రాజీనామా చేశారు. జగన్ నిర్ణయం తనను బాధించిందని తన రాజీనామా సందర్భంగా యార్లగడ్డ వ్యాఖ్యానించారు.

ఆ తరువాత మళ్ళీ ఏమైందో ఏమో.. భయపడ్డారో ఎవరైనా ఏమన్నారో గానీ నేడు నాలుక మడత వేసి మొత్తం రివర్స్ గేరులో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని తూర్పారబట్టారు.చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.

అలాగే ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకుంది కూడా చంద్రబాబేనని, ఇందుకు తానే ప్రత్యక్ష సాక్షినని వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అంటే తనకు చాలా ఇష్టమని, వైఎస్సార్ సంస్కారవంతుడు కాబట్టే తెలుగు గంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. నాడు బాలకృష్ణ విషయంలో వైఎస్సార్‌ని సాయం కోరితే ఆయన సాయం చేశారన్నారు.

జగన్‌ను తానెందుకు తిట్టాలని ప్రశ్నించారు.. చాలామంది టీడీపీ అభిమానులు తనకు ఫోన్లు చేసి కుల ద్రోహి, తెలుగు ద్రోహి అని తిడుతున్నారని వాపోయారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన జగన్‌ను ఎందుకు తిట్టడం లేదని తనను తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ 151 సీట్లు సాధించిన జగన్‌ను తాను ఎందుకు తిట్టాలని ప్రశ్నించారు. సోనియా గాంధీ కేంద్ర మంత్రిని చేస్తానన్నప్పటికీ జగన్ ఓదార్పు యాత్ర చేసి ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. సొంత పార్టీ పెట్టుకుని కష్టపడి ఎన్నికల్లో గెలిచారని.. 151 సీట్లు సాధించారని చెప్పారు. నా దృష్టిలో జగన్ హీరో అని అన్నారు.

త‌న వల్ల ఆయనకు ఒక్క ఓటు కూడా రాదని.. అయినా తనను పిలిచి పదవి ఇచ్చారని కొనియాడారు. వైఎస్సార్ తెలుగు భాష కోసం ఎంత పాటు పడ్డారో అంత కృషిని జగన్ కూడా చేస్తున్నారని తెలిపారు. తానెప్పుడూ జగన్‌ను పల్లెత్తు మాట అనలేదన్నారు. తాను తన పదవులకు చేసిన రాజీనామాలను ఉప సంహరించుకోబోనని స్పష్టం చేశారు. అయితే తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటానన్నారు.

ఇకపై తాను ఎటువంటి రాజకీయ పదవులు చేపట్టబోనన్నారు. మొత్తానికి ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు విషయంలో లక్ష్మీపార్వతి కన్నా వేగంగా స్పందించి రాజీనామా చేసిన యార్లగడ్డ మళ్ళీ రెండ్రోజుల్లోనే ఇలా మాట మార్చి మాట్లాడడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ విషయంలో ఆయనకు ప్రభుత్వంలోని ముఖ్యుల నుంచి హెచ్చరికలు వెళ్లినాయేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated On 28 Sep 2022 8:38 AM GMT
Somu

Somu

Next Story