విధాత: యాసంగి పంటలు వేసే సమయం ఆసన్నమైంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యాసంగి పంటలకు ప్రాజెక్టుల కింద పంటల సాగుకు సకాలంలో నీటి విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ నేడు నిర్ణయం తీసుకోనున్నది. ఈ మేరకు ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక-యాజమాన్య కమిటీ సమావేశం జరుగనున్నది. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురిసిన విషయం తెలిసిందే. దీంతో గోదావరి, కృష్ణా నదులతో పాటు ఉపనదులు, చిన్న పెద్ద చెరువులు, […]

విధాత: యాసంగి పంటలు వేసే సమయం ఆసన్నమైంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యాసంగి పంటలకు ప్రాజెక్టుల కింద పంటల సాగుకు సకాలంలో నీటి విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ నేడు నిర్ణయం తీసుకోనున్నది. ఈ మేరకు ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక-యాజమాన్య కమిటీ సమావేశం జరుగనున్నది.
ఈ ఏడాది వర్షాలు అధికంగా కురిసిన విషయం తెలిసిందే. దీంతో గోదావరి, కృష్ణా నదులతో పాటు ఉపనదులు, చిన్న పెద్ద చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లిపోయాయి. అంతేకాదు భూగర్భజలాలు కూడా పెరిగాయి. పంటలకు సమృద్ధిగా నీరు లభిస్తుండడంతో రైతులు మురిసిపోతున్నారు.
