HomelatestAPలో ఎవరి లెక్కలు వారివి| మాకు వైసీపీ వాళ్లు.. ఓటు వేయలేదు: తెలుగుదేశం

APలో ఎవరి లెక్కలు వారివి| మాకు వైసీపీ వాళ్లు.. ఓటు వేయలేదు: తెలుగుదేశం

AP Political |

విధాత‌: ఏపీ అసెంబ్లీలో శాసనమండలి సభ్యుల ఎన్నిక సందర్భంగా వైసీపీకి చెందిన కొందరు క్రాస్ ఓట్ వేసి టీడీపీ సభ్యురాలు అనురాధను గెలిపించినట్లు తేల్చిన హై కమాండ్ నలుగురిని సస్పెండ్ చేయగా.. ఇటు టీడీపీ మాత్రం సరికొత్త లాజిక్ తీసుకొస్తోంది. తమకు ఎవరూ వైసీపీ వాళ్ళు ఓటు వేయలేదని తమ ఎమ్మెల్యేలు 23 గెలిచారు కాబట్టి వాళ్లంతా తాము జారీ చేసిన విప్‌ను పాటించి తమ అభ్యర్థికే ఓటు వేశారని టీడీపీ చెబుతోంది.

అంతే వైసీపీ వైపు మళ్ళిన మద్దాలి గిరి, వంశీ, బలరాం, వాసుపల్లి గణేష్ కూడా టీడీపీకే వేసినట్లు టీడీపీ చెబుతోంది. తమ పార్టీ తరఫున గెలిచినా సభ్యులు తమకు ఓటేసి అనురాధను గెలిపించారని టీడీపీ చెబుతుండగా వైసీపీ మాత్రం తమ పార్టీకి చెందిన నలుగురిని సస్పెండ్ చేసేసింది. ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను వైసీపీకే ఓటు వేశానని అంటున్నారు. పార్టీలో చెప్పుడు మాటలకు ప్రాధాన్యం అని, ఎమ్మెల్యేలు, ఎంపీలకు విలువ లేదని ఆవేదన చెందారు. వైసీపీ కేవలం కక్ష గట్టి తనను టార్గెట్ చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు.

మరో వైపు ఆత్మ ప్రబోధానుసారంగా ఓటేశానని చెప్పిన ఆనం రాంనారాయణరెడ్డి ఎక్కడా నోరు మెదప లేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ కూడా వైసీపీ మీద గట్టి కామెంట్స్ చేశారు. పార్టీకి భవిష్యత్ లేదని, మున్ముందు పార్టీ కనుమరుగవుతుందన్నారు.

మరోవైపు పార్టీ నుంచి సస్పెండ్ అయిన శ్రీదేవి ఆఫీస్ వద్ద వైసీపీ అభిమానులు గలాటా చేశారు. పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తూ శ్రీదేవి కార్యాలయం దగ్గర ఫ్లెక్సీల చించేసి శాపనార్థాలు పెట్టారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular