విధాత: శాసన మండలి ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఏడు స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో పార్టీ కట్టుబాటు కాదని టీడీపీ సభ్యురాలు అనురాధ గెలుపు కోసం ఓటేసిన నలుగురు ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.
ఈ మేరకు నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ టికెట్ దక్కదు అని ప్రచారం జరుగుతున్న నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపు చూస్తూ… ఆయన కనుసన్నల్లో టీడీపీకి ఓటేసినట్లు వైసీపీ గుర్తించింది. దీంతో ఆ నలుగురి మీద పార్టీ వేటు వేసింది.
ఎమ్మెల్యేకు కేటాయించిన కోడ్ ఆధారంగా మొదటి ప్రాధాన్యతా, రెండో ప్రాధాన్యతగా వచ్చిన ఓట్లను బట్టి నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడట్టు పార్టీ అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు పార్టీ విప్ ధిక్కరించి టీడీపీకి ఓటేయడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించింది.
ఇదిలా ఉండగా ఒక్కో ఎమ్మెల్యేను దాదాపు పదేసి కోట్లకు చంద్రబాబు ఎరవేసి కొన్నారని వైసీపీ తరఫున, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. సభలో బలం లేకున్నా కేవలం ఎమ్మెల్యేలను కొనేసి తద్వారా ఎమ్మెల్సీ సీటును చంద్రబాబు దక్కించుకున్నారని సజ్జల ఆరోపించారు. మొత్తానికి నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నిక నలుగురి పీకల మీదకు వచ్చిందన్న మాట.
క్రాస్ ఓటింగ్ ఎలా కనిపెట్టవచ్చు?
YSRCP MLC క్యాండిడేట్స్ A,B,C,D,E,F & G అనుకుందాం.
ప్రతి MLA కి క్రింది ఉన్నట్టు ఓట్ వెయ్యమని చెబుతారు.
డౌట్ ఉన్న ఎమ్మెల్యేలకి 2nd & 3rd ప్రాధాన్యత votes combination unique ఉంటుంది
ఎవరి unique code miss అయ్యిందో చూసి క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేని కనిపెడతారు
ముందుగా సీక్వెన్స్ ఇవ్వడంతో దొరికిపోయిన ఎమ్మెల్యేలు.