Sunday, December 4, 2022
More
  Homelatestఇంట్లో అశాంతి ఎందుకో అర్థం కావడం లేదా? వాస్తు సరిగ్గానే ఉందా!

  ఇంట్లో అశాంతి ఎందుకో అర్థం కావడం లేదా? వాస్తు సరిగ్గానే ఉందా!

  పిల్లలు చెప్పిన మాట వినటం లేదా?
  ప్రతి పనికి చుక్కెదురవుతోందా?
  ఖర్చులు ఎక్కువై ఎంత సంపాదించినా నిలవడం లేదా?
  ఆఫీసులో చిన్న ప్రాబ్లం కూడా కొండంత అవుతోందా?
  ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒక అనారోగ్యం వేధిస్తోందా?
  మీరు నివసిస్తున్న ఇంట్లో ఏదైనా దోషం ఉందేమో చూసుకుంటే మంచిదేమో ఒకసారి ఆలోచించండి.

  విధాత: మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అని పాడు కోవాలని అందరూ అనుకుంటారు. ఇల్లు అందంగా ఉండాలని, సుఖ, సంతోషాలతో, సిరిసంపదలతో విరాజిల్లాలని ఆశపడని వారు ఎవరుంటారు. ఆశగా కలల సౌధం నిర్మించుకున్నా కూడా అది వాస్తు ను అనుసరించి లేకపోతే ఇబ్బందులు పడతారని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.

  ఒక భవనం అందమైన ఇల్లుగా మారాలంటే ఎనర్జీతో ఉండాలి. ఆ ఎనర్జీ పాజిటివ్‌గా కూడా ఉండాలి. ఆ ఇంట్లో నివసించే వారి మీద దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందని వాస్తు చెబుతోంది. ఈ ఎనర్జీలను బాలెన్స్ చెయ్యడమే వాస్తు నియమాల ఉద్దేశ్యం. మన దేశంలోని కట్టడాల్లో వేలాది నిర్మాణాలు శతాబ్ధాలుగా అలాగే నిలిచి ఉండడానికి కారణం వాస్తు పరిజ్ఞానమే. వాస్తు అంటే సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని అర్థం. ఇది భారతీయ ఆర్కిటెక్చర్ విజ్ఞానం. వాస్తు వేదాలలో పొందు పరిచిన జ్ఞానం. వేల సంవత్సరాలు భారతీయుల నమ్ముతున్న శాస్త్రం వాస్తు. వాస్తు అథర్వణ వేదంలోని సత్పత్య వేదంలో ఒక భాగం.

  వాస్తు దోషం అంటే?

  వాస్తు శాస్త్రంలో కట్టడాలకు సంబంధించిన కొన్ని నియమాలను వివరించారు. నిర్మాణం మాత్రమే కాదు దానికి ఉపయోగించిన స్థలం సైతం ఈ నియమాలను అనుసరించి ఉండాలి. అలా లేనపుడు ‘‘వాస్తు ధోషం’’ ఉన్నట్టుగా పరిగణిస్తారు. వాస్తు దోషం అంటే ఇన్ బాలెన్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పవచ్చు. ప్రతి ఇల్లు ఏదో ఒక ఎనర్జీతో ఉంటుంది.

  ఇంటిలో గదుల నిర్మాణం, గదుల్లో వస్తువుల అమరిక ఆ ఎనర్జీని అనుసరించి లేకపోతే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. సరైన వాస్తు ఆయువు, ఆరోగ్యం, జ్ఞానం, సంపద, దాంపత్య సౌఖ్యం, వృత్తి పరమైన అభివృద్ధి, ఇలా జీవితంలోని ప్రతి అంశంలో ప్రభావం ఉంటుందని నమ్మకం కొండకచో రుజువులు కూడా ఉన్నాయి. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే జీవితంలో ప్రతీ కోణం మీద చెడు ప్రభావం పడుతుంది.

  కొన్ని రకాల వాస్తు దోషాలు వాటి ప్రభావాలు

  • వాస్తు ప్రకారం పూజ గది ఈశాన్య దిశలో ఉండాలి. నైరుతిలో పూజ పనికిరాదు.
  •  నైరుతి దిక్కున మాస్టర్ బెడ్ రూం ఉండాలి. వాయవ్యంలో ఉండకూడదు
  •  నిర్మాణ స్థలం ఆకృతి సరిగ్గా లేకపోయినా అది దోషం భూయిష్టమైన భూమిగా భావించాలి

  వాస్తు దోషాల్లో రకాలు

  నివాస స్థలాలు, వ్యాపార స్థలాలు, ప్రొడక్షన్ యూనిట్లు ఇలా ప్రతి ప్రదేశానకి తగిన వాస్తు నయమాలు ఉంటాయి.బెడ్ రూమ్, కిచెన్, డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, పూజగది, పిల్లల గది, స్టడీరూమ్, గెస్ట్ రూమ్, బాత్ రూమ్, బేస్మెంట్, లాకర్ రూమ్, పనివాళ్ల గది, స్టోర్ రూమ్ ఇంట్లోని ప్రతి భాగం గురించి వాస్తు ప్రస్తావించింది. అంతేకాదు కిటికీలు, తలుపులు, బాల్కనీలు, మెట్లు, ఓవర్ హెడ్ ట్యాంక్, స్విమ్మింగ్ ఫూల్, ప్రహరీ గేట్, అండర్ గ్రౌండ్ ట్యాంక్, బోర్వెల్ , ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంటికి వాడే రంగులు, లైట్లు, కన్స్ట్రక్షన్, రెనోవేషన్ ఇలా ఇంటినిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలకు ప్రత్యేక నియమాలు, సిద్ధాంతాలు ఉన్నాయి.

  వాస్తు దోష ప్రభావాలు

  కేవలం నిర్మాణంలోని ఒక భాగాన్ని చూసి దోషాన్ని గురించి నిర్ధారణకు రాలేము. అందరికీ ఒకే నియమం వర్తించకపోవచ్చు కూడా. వాస్తు నిపుణుల అభిప్రాయంలో అందరికీ ఒకే కరమైన వాస్తు నియమాలు వర్తించవు. అది వ్యక్తుల జాతక చక్రాన్ని అనుసరించి కూడా ఉంటుంది. కొన్ని సాధారణ వాస్తు నియమాలను గురించి ఒక సారి చూద్దాం.

  ఈశాన్య వాస్తు దోషం: కుటుంబ కలహాలు, వ్యాపార కలహాలు, పిల్లల ప్రవర్తన సరిగా లేకపోవడం, ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఖర్చులు పెరగడం, చికిత్సలు లేని జబ్బులు, న్యాయపరమైన చిక్కులు, వ్యాపారంలో నష్టాలు

  నైరుతి వాస్తు దోషం: ఇంట్లో పెళ్లీడు వారికి పెళ్లిళ్లు కుదరకపోవడం, ఖర్చులు పెరగడం, చెడు అలవాట్లు, దొంగతనాలు జరగడం, నష్టపోవడం, దంపతుల మధ్య కలహలు

  ఆగ్నేయ వాస్తు దోషం: శత్రు పీడ, చట్ట పరమైన చిక్కులు, ప్రభుత్వ పరమైన చిక్కులు, బంధు మిత్రులతో కలహాలు

  ఇవి మాత్రమే కాదు మెయిన్ ఎంట్రెన్స్ కి ఎదురుగా ఏదైనా అడ్డుగా ఉండడం, T జంక్షన్‌కు ఎదురుగా ఇల్లు ఉండడం, బెడ్ రూమ్ కింద వంట గది ఉండడం, వంట చేసుకునే పొయ్యి, వాటర్ ట్యాంక్ ఒకే వరుసలో ఉండడం, మంచానికి ఎదురుగా అద్దం ఉండడం, మూడు తలుపులు ఒకే వరుసలో ఉండడం వంటివి కూడా పెద్ద వాస్తు దోషాలుగా పరిగణించవచ్చు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page