కొడాలి నాని ప్ర‌క‌ట‌న దానికి సంకేత‌మా.. YS.Jagan.. Lokesh.. Byreddy.. Kodali Nani విధాత‌: ఈసారి మళ్ళీ గట్టిగా కొట్టాలి.. ఈ దెబ్బతో టిడిపి, చంద్రబాబు మళ్లీ లేవకూడదు.. వై నాట్ 175 అనే గట్టి కాన్సెప్ట్ మీద ఎన్నికల యుద్ధానికి బయల్దేరిన జగన్ ఈసారి అభ్యర్థుల ఎంపికలోనూ డైనమిక్‌గా ఉంటున్నారని అంటున్నారు. మొన్న మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్‌ను మళ్ళీ దెబ్బ కొట్టాలని జగన్ స్కెచ్ వేశారని అంటున్నారు.. ఈసారి లోకేష్ మీద కర్నూల్ జిల్లా నందికొట్కూరుకు […]

  • కొడాలి నాని ప్ర‌క‌ట‌న దానికి సంకేత‌మా..

YS.Jagan.. Lokesh.. Byreddy.. Kodali Nani
విధాత‌: ఈసారి మళ్ళీ గట్టిగా కొట్టాలి.. ఈ దెబ్బతో టిడిపి, చంద్రబాబు మళ్లీ లేవకూడదు.. వై నాట్ 175 అనే గట్టి కాన్సెప్ట్ మీద ఎన్నికల యుద్ధానికి బయల్దేరిన జగన్ ఈసారి అభ్యర్థుల ఎంపికలోనూ డైనమిక్‌గా ఉంటున్నారని అంటున్నారు. మొన్న మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్‌ను మళ్ళీ దెబ్బ కొట్టాలని జగన్ స్కెచ్ వేశారని అంటున్నారు..

ఈసారి లోకేష్ మీద కర్నూల్ జిల్లా నందికొట్కూరుకు చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిని (Byreddi Siddhartha Reddi) బరిలో దించుతామని కొడాలి నాని చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.

ఏపీలో వైసీపీని, జగన్ ప్రభుత్వాన్ని లోకేశ్ (Lokesh Nara) తన యువగళం పాదయాత్రలో విమర్శిస్తుండడంతో మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ విమర్శలు చేశారు. లోకేశ్ యువగళానికి పోటీగా తమ పార్టీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని చేత సభ పెట్టిస్తామన్నారు. లోకేష్ సభకంటే సిద్ధార్థ రెడ్డి సభకు పదిరెట్లు యువత రాకుంటే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానన్నారు. యూత్‌లో లోకేశ్ కంటే సిద్ధార్థరెడ్డికే క్రేజ్ ఎక్కువ అన్నారు. యువతలో రాష్ట్రంలో ఏ సెంటర్లో అయిన సిద్ధార్థరెడ్డి పిలుపునిస్తే ఎంతమంది యువత వస్తారో.. లోకేశ్ పిలిస్తే ఎంతమంది యువత వస్తుందో చెక్ చేసుకోవాలని సవాల్ విసిరారు.

వచ్చే ఎన్నికలలో లోకేష్ మీద పోటీ చేసేది సిద్ధార్ధ రెడ్డేనని నాని అన్నారు. అయితే.. లోకేశ్ గత ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారీ అక్కడే పోటీ చేస్తారన్న మాట టీడీపీ నుంచి వినిపిస్తోంది. ఇక సిద్ధార్థరెడ్డి రాయలసీమ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న యువ నాయకుడు.
మరి.. మంగళగిరిలో లోకేశ్ పై సిద్ధార్థ రెడ్డిని పోటీ చేయిస్తారా.. లేదంటే రాయలసీమలో లోకేశ్ పోటీ చేస్తారని ఏమైనా సమాచారం ఉందా తెలియడం లేదు. ప్రస్తుతం సిద్దార్థరెడ్డి శాప్ చైర్మన్ గా పనిచేస్తున్నారు.

Updated On 7 March 2023 12:01 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story