YS Sunitha విధాత‌: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసు విషయమై కోర్టులో పోరాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి కారణమైన ఆయన కుమార్తె వైఎస్‌ సునీత (YS Sunitha) టీడీపీ వైపు వెళుతున్నారా.? రానున్న రోజుల్లో ఆమె టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారా,? ఏమో ఆమె అడుగులు అలాగే పడుతున్నాయి. ఆమె ఆలోచనలూ అలాగే కనిపిస్తున్నాయి. తన తండ్రి హత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలనీ సీబీఐ చుట్టూ తిరుగుతూ ఆఖరుకు తనకు సోదరుడు అయ్యే కడప […]

YS Sunitha

విధాత‌: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసు విషయమై కోర్టులో పోరాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి కారణమైన ఆయన కుమార్తె వైఎస్‌ సునీత (YS Sunitha) టీడీపీ వైపు వెళుతున్నారా.? రానున్న రోజుల్లో ఆమె టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారా,? ఏమో ఆమె అడుగులు అలాగే పడుతున్నాయి.

ఆమె ఆలోచనలూ అలాగే కనిపిస్తున్నాయి. తన తండ్రి హత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలనీ సీబీఐ చుట్టూ తిరుగుతూ ఆఖరుకు తనకు సోదరుడు అయ్యే కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు ఆ కేసును చూట్టేలా చేయడంలో సునీత సక్సెస్ అయినట్లే లెక్క.

ఇప్పుడు అయన బెయిలుకు, జైలు కు మధ్య ఊగిసలాడుతున్నారు. అయితే ఓ సాధారణ మహిళ . ఆర్థికంగా అంతగా పటిష్టంగా లేని మహిళ అధికార పార్టీ ఎంపీని ఇరికించే స్థాయికి ఎలా వెళ్లారు.. ఒక పూటకు లక్షల్లో ఫీజు తీసుకునే పెద్ద పెద్ద లాయర్లను ఆమె ఎలా ఎంగేజ్ చేయగలిగారు.. మాటిమాటికీ ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులను కలిసి తన ఫిర్యాదు మీద.. సీబీఐని సైతం నిలదీసే స్థాయికి ఎలా వెళ్లారు.

అంత పరిణితి, పరిజ్ఞానం. ఆర్థిక వనరులు.. లేవు కదా మారేలా అని అంటున్న వారి కళ్లన్నీ ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నాయి. టీడీపీ, చంద్రబాబు కనుసన్నల్లో సునీత నడుస్తున్నారని, న్యాయ శాఖ.. కోర్టుల్లో చంద్రబాబుకు ఉన్న పరపతి, పెద్దలతో ఉన్న సంబంధాలు .. ఇవన్నీ సునీత(YS Sunitha)కు ఉపయోగించారని వైసిపి ఆరోపిస్తోంది.

అందువల్లనే ఆమె కోర్టుల్లో ఇంత సమర్థంగా పోరాడి జగన్ , అవినాష్ వంటి వారిని సైతం ఇబ్బంది పెట్టగలిగారని అంటున్నారు. ఇదే తరుణంలో ఆమె టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని అంటున్నారు.. రానున్న ఎన్నికల్లో కడప ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

తన తండ్రి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తనకు సోదరుడు అయ్యే అవినాష్ మీద సునీత పోటీ చేస్తారు అని అంటున్నారు. దానికి గాను ఆమెకు టికెట్, ఆర్థిక వనరులు అన్నీ సమకూర్చే పనులు టీడీపీ, చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు.

ఈ మేరకు ఇప్పటికే కడప జిల్లాలో సునీత.. టీడీపీ నాయకుల ఫొటోలతో కూడిన పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఆంటే ఆమె ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారా..? మున్ముందు సునీత టీడీపీతో కలిసి నడుస్తారా, ఎన్నికల్లో పోటీ చేస్తారా.. చూడాలి.

Updated On 25 April 2023 8:00 AM GMT
Somu

Somu

Next Story