Thursday, March 23, 2023
More
    Homeబిజినెస్స్పోర్ట్స్‌ థీమ్డ్‌ ప్రాజెక్ట్‌తో వ‌స్తున్న జీ స్క్వేర్ హౌసింగ్‌

    స్పోర్ట్స్‌ థీమ్డ్‌ ప్రాజెక్ట్‌తో వ‌స్తున్న జీ స్క్వేర్ హౌసింగ్‌

    దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీ స్క్వేర్‌ హౌసింగ్‌ సంస్థ ఇప్పడు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. రియాల్టీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాంపాదించిన జీ స్క్వేర్‌ హౌసింగ్‌ హైదరాబాద్‌లోనూ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బీఎన్‌ రెడ్డి నగర్‌లో మొట్టమొదటి స్పోర్ట్‌ థీమ్డ్‌ లగ్జరీ ప్లాట్ కమ్యూనిటీని ‘జీ స్క్వేర్ ఈడెన్ గార్డెన్’ (G Square Eden Garden) పేరుతో గ్రాండ్‌గా లాంచ్‌ చేసింది.

    విలాసవంతమైన సౌకర్యాలు, కస్టమర్లు కొరుకునే వసతులు వంటివి ప్రత్యేకతలుగా ఉన్న ఈ ప్రాజెక్ట్‌ మొత్తం 65 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కమ్యూనిటీలలో నివసించేందుకు ఇష్టపడే వారికి ఇది బెస్ట్‌ చాయిస్‌ అని చెప్పచ్చు. ఇంతవరకు జీ స్క్వేర్ చేపట్టిన ప్రాజెక్ట్‌లన్నీ కూడా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, మెట్రోలు, మాల్స్ వంటి వాటికి సులభమైన యాక్సెస్‌ని అందించే గేటెడ్ కమ్యూనిటీలే. అంతేకాకుండా తక్షణమే నిర్మాణాలు చేపట్టడానికి అనువుగా కూడా ఉంటాయి. కస్టమర్ల సౌకర్యాల విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ప్రాజెక్ట్‌ల రూపకల్పన వీరి స్పెషాలిటీ.

    ప్రాజెక్ట్‌ ప్రత్యేకతలు

    • ఇందులో 484 ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్‌లు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ(GHMC), TS (RERA) ద్వారా పూర్తి స్థాయి అమోదం పొందింది.
    • ఇక్కడి నుంచి 5 నిమిషాల ప్రయాణం చేస్తే చాలు ఎల్‌బీ నగర్‌ సర్కిల్ చేరుకుంటాం
    • ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ హైవేకి   పక్కనే ఉండడం
    • ప్లాటెడ్‌ కమ్యూనిటీలోని సభ్యులందరూ ప్రపంచ శ్రేణి వసతులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తుంది.
    • హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పార్కులలో ఒకటిగా ఉన్న ఆదిబట్లకు సమీపంలో ఉన్న బీఎన్‌ రెడ్డి నగర్‌

    సౌకర్యాలు అదరహా..

    .బ్లాక్-టాప్ రోడ్లు, ప్రీమియం స్ట్రీట్ లైట్లు, అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ట్రిసిటీ, అద్బతమైన నీటి సరఫరా వ్యవస్థ, అత్యుత్తమ డ్రైనేజీ అవుట్‌లెట్ సిస్టమ్‌తో పాటు 5 సంవత్సరాల ఫ్రీ మెయిన్‌టెనెన్స్‌
    .జీ స్క్వేర్ ఈడెన్ గార్డెన్ లగ్జరీతో పాటు ప్రశాంతమైన లివింగ్‌ స్టైల్‌ కోరుకునే వారి కోసం 100+ ప్రపంచ స్థాయి సౌకర్యాలు తన కస్టమర్లకు అందిస్తోంది. అందులో 40+ ప్రత్యేకమైన స్పోర్ట్స్ ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. సరసమైన ధరతో కూడిన ఈ విల్లా ప్లాట్లు ప్రాజెక్ట్‌ సొంతం.

    జీ స్క్వేర్‌ హౌసింగ్‌ సీఈఓ ఈశ్వర్‌ ఎన్‌ మాట్లాడుతూ ..‘‘ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది. నగరంలో జీ స్క్వేర్ ఈడెన్ గార్డెన్‌ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాము. ఇందులో కస్టమర్లు కోరుకునే సౌకర్యాలు, లగ్జరీ వసతులు, రవాణా సదుపాయం, క్రీడా సౌకర్యాలు వంటి ఈ ప్రాజెక్ట్‌కు ఆకర్షణగా నిలుస్తాయి. ప్లాట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, నగరంలో తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్న వ్యక్తులకు ఇది గొప్ప అవకాశమన్నారు’’

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular