విధాత: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు బీజేపీలో చేరబోతున్నరా అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన ఈటల రాజేందర్‌తో పాటు ఢిల్లీలో ఉండటం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నది. అయితే బీజేపీలో మధు చేరికను ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. అయితే బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటల ద్వారా మధు.. అంతే తీవ్రంగా పార్టీలో చేరికకు ప్రయత్నం చేస్తున్నారట. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన ఎమ్మెల్యే […]

విధాత: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు బీజేపీలో చేరబోతున్నరా అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన ఈటల రాజేందర్‌తో పాటు ఢిల్లీలో ఉండటం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నది. అయితే బీజేపీలో మధు చేరికను ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

అయితే బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటల ద్వారా మధు.. అంతే తీవ్రంగా పార్టీలో చేరికకు ప్రయత్నం చేస్తున్నారట. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ ఎంపీల సమావేశానికి టీఆర్ఎస్ నుంచి మధుకు ఆహ్వానం అందలేదు.

దీనితో తీవ్ర మనస్తాపంలో ఆయన తనకు కాకుండా మరొకరికి టికెట్ వస్తుందని ముందే తన దారి వెతుక్కుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తనపై ఎప్పుడైనా ఈడీ, రైడ్స్ జరగవచ్చు అనే ఆలోచనలో మధు ఉన్నారట.

పార్టీ మారట్లేదు.. నాపై దుష్ప్రచారం: పుట్ట మధు

Updated On 19 Nov 2022 9:32 AM GMT
krs

krs

Next Story